పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Rammohan Rao Thummuri కవిత

వాకిట్లో వసంతం .............................. ధర్మనిష్ఠ తో రాముడు పదునాలుగేళ్లు పాండవులు పుష్కర కాలమే అరణ్యవాసం చేసింది అస్థిత్వపు ఆరాటంతో అలుపెరుగని పోరాటపటిమతో అరువదేండ్ల జనారణ్యవాసం చేసిన నాలుగున్నరకోట్ల గుండెవాకిళ్లలోకి గెలుపు చప్పుళ్లతో మెరుపు గుప్పిళ్ళతో ఎగజల్లిన గులాలై వలపులా వసంతం దిగివచ్చింది ఎన్నిత్యాగాల పచ్చిమామిడి కాయలు ఉరితాళ్ళు మెడలకు పూల హారాలుగా వేసుకున్నాయో ఎన్ని కలాలు అక్షరాయుధాలయ్యి పోరాటయోధుల పోడిమి వసివాడకుండా నిద్రలేమిని వరించాయో ఎన్ని గళాలు కళాజాతరలుగా నిరవధిక ఉద్యమస్ఫూర్తికి నిరంతరం మోగే యుద్ధ భేరీలయ్యయో ఎన్ని మేధస్సులు చరిత్రపుటలను చెదలు వదలించడానికి తపస్సులు చేశాయో ఆరుదశాబ్దాల తిమిరంతో సమరం వేయి వెలుగుల విజయ విహారమై కోటి గొంతుల జయ జయ నినాదమై నిద్రాణమైయున్న ఆశల ఆశయాల మేల్కొల్పిన కాహళారవమై నిర్ణయాలను నీరుగార్చడానికి పన్నిన కుట్రల కుతంత్రాల శకునుల పన్నాగాలను సైంధవుల శిశుపాలుర ఆగడాలను అరికట్టడానికి ఎన్ని కృష్ణరాయబారాలు జరిగాయో నిన్నటి విజయ విక్రమం నేడు జయ జయధ్వానం కోటిరతనాల వీణా నిక్వాణం వాకిట్లో వసంతవిలాసం చిమ్మచీకట్లో చిరుదివ్వెల చిరుదరహాసం 'వాధూలస' జయ ఉగాది

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN5JW

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి