పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Sree Kavitha కవిత

'' మనసంతా నువ్వే''లో నన్ను త్రుతియ విజేతగా నిలిపిన నా ''కవితా సుమం '' ------------- ********** -------------- 'శ్రీకవిత' ||'జయ'కేతనాల ఉగాది || (ఉగాది కవితల పోటీకి) ఆకులు రాల్చి మోడు వార్చిన శిశిర ఋతువు చిద్విలాసాలున్న విజయ నామ సంవత్సరం ఆఖరి అంకానికి చిరునవ్వుల వీడ్కోలు కాల చక్రంలో నీ 'విజయ ' 'ఆపజయాలు ' చిరస్మరణీయం ఉద్వేగ భరితం రసరమ్య రాగ భరితం నీతో గడిపిన క్షణాలు మనోహరం ఆ మధురస్మృతులతో మమేకమై ముందుకు వెళ్తూ... మరో నూతనానికి "నీరీక్షణాలు"..!! నీరీక్షణాలకు చరమగీతం పలుకుతూ చైత్ర మాస శుక్ల పక్షం శుభారంభం మోడువారిన జీవకోటిని వర్షించి హర్షించుటకై వసంత ఋతువు ఆగమనం ఆశయాల చెట్టను చిగురింప జేసే ఘడియ చైత్ర శుద్ధ పాడ్యమి బ్రహ్మ దేవుడి సృష్టికి చక్కని ముహూర్త గడియ 'యుగ్ ''ఆది "ఉగాది".ఆ పర్వదినాన నూతనానికి నాంధి పలకమంటూ ఆభయమిస్తున్న "జయనామ సంవత్సరానికి " !!స్వాగతం సుస్వాతం!! ఆ శుభవేళ అరుణకిరణాల విభావరిలో ఆశల ఉత్తేజంతో తేజం సరిచేసుకొని జయంకోరే వారికి జీవితం షడ్రుచుల సమ్మిళితం, రాగద్వేషాల రసరమ్యమని తెలిపేందుకు వేపపువ్వుతో చేదు అనుభవాల దుఃఖాన్ని,భెల్లంతో మధురమైన తీపిగుర్తులను, పచ్చిమిరపకాయల కారంతో కోపాన్ని, ఉప్పుతో భయాన్ని, చింతపండుతో చిరాకుని లేతమామిడితో ఆశ్చర్యాన్ని మిశ్రమం చేసి ఆరగించమనే మధుర ఫలహారం "ఉగాది పచ్చడి" ...!! ఆరుణోదయాన శతమానం భవతి అంటూ శథగోపునికి శిరసావహించి మనోవాంఛ ఫలసిద్ధికై వేదోపనిషత్తులు ఆవిఘ్నం కోసం విఘ్నేశ్వరుఁడి ముందు గుంజిళ్లు, సాష్టాంగ ప్రణామాలు, పూజారుల ఆశీర్వచనాలు కాలచక్రంలో గ్రహాల గమనాన్ని గుణించి బేరీజు వేసుకొని అనుగ్రహం పొందటానికి అనువైన తిథి,వార,నక్షత్ర,యోగ,కారణ కూడిన రాశి ఫలాల శుభగడియలు పన్నెండు మాసాల ఆణుకువలు మెళకువలు విపులంగా తెలుసుకొనేలా సంపుటించిన పుస్తకాన్ని కర్తవ్యంగా ఆలకించడమే "పంచాంగ శ్రవణం"...!! ముంగిలిలో ముగ్గులా, షడ్రుచుల మృస్టాన్నభోజనంలా ,ఆమని కోయిలలా వచ్చింది ఉగాది మళ్ళీ పన్నెండు మాసాల బంధంతో మావి చిగురుల హరితవర్ణంతో భవితల బాంధవ్యాల వేడుకై నటనకు నందులు, కవులకు సన్మానాలు, సాహితీ సేవకు సముచిత పురస్కారాలు మళ్ళీ మొదలు కమ్మని వంటల ఘుమఘుమలు,కొత్త ఆల్లుళ్ళకు కానుకల దీవెనలు మన సాంప్రదాయాలు ప్రపంచ తెలుగు వారందరికి జయనామ సంవత్సరంలో హర్షాతి జయకేతనాలు అందాలని ప్రార్ధిస్తూ ఉగాది శుభాభినందనలు

by Sree Kavitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oa5ENM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి