పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మార్చి 2014, శుక్రవారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ -----సినీ ఫ్యాన్స్ అమ్మ చుట్టమూ కాదు, అయ్య చుట్టమూ కాదు అభిమానం నరనరాన నిండినప్పుడు క్షీరాభిషేకాలతో,పుష్పాభిషేకాలతో తడిసి ముద్ధవుతుంటాయి నిలువెత్తు చిత్రపటాలు . ద్వంద్వార్ధ పదాలు ,అర్ధనగ్నాల కంపుని నింపుకుని తెరమీద పరుచుకున్న తొలిరోజు కొంతమందికి పండుగ రోజు . విగ్గు చెదరదు,చెమటచుక్క చిందదు వందల సంఖ్యలో రౌడీలు మట్టి కరుస్తారు జిమ్మిక్కులతో ఫైటింగులు చేస్తూ . ఒక్క విజిల్ వేస్తే వంద సూమోలు గాల్లోలేస్తాయి మన రోమాలు నిక్కబోడుస్తూ చిటికెనవేలు చిటికేస్తే దైనమెట్లు ధద్ధరిల్లుతాయి . వొంట్లో రక్తాన్ని ఉడికిస్తూ . ఒక్క అభివాదం చాలు అభిమానం కట్టలు తెచ్చుకోటానికి ఆవేశం హద్దులు దాటటానికి నువ్వెవరో అసలు తెలుసో లేదో వాళ్లకి. ఇంటికో పోస్టర్ ,వీధికో అభిమానసంగం తారలకు సమస్యలు తెస్తూ వారానికొకరి తలరాతలు మారుస్తూ . తెరమీద తోలుబొమ్మలే వారు కనుసైగ చేస్తే అవుతున్నారు కీలుబొమ్మలు. గుర్తుందో లేదో కన్నోళ్ళ బాగోగులు తారల జన్మదినాలు .. పర్వదినాలు తరించిపోతారు చేస్తూ రక్తదానాలు . చలిమర గదుల్లో సుఖ సంతోషాలతో, నోట్లతో ,కోట్లతో వారు ఎండా ,వానా లెక్కచేయక టిక్కెట్ల కోసం కుస్తీ పడుతూ గాల్లో కలసిపోయే ప్రాణాలు కొన్ని ! (14-03-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1IAy4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి