పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మార్చి 2014, శుక్రవారం

Kapila Ramkumar కవిత

రచన: పద్మాశ్రీరామ్ అంతులేని మృగవాంఛలిలానే కొనసాగితే గుళ్లో దేవతల విగ్రహాలు సైతం భయంతో పరుగెత్తే కాలమొకటి వస్తుందని, మృత్యుదేవత సైతం భీతిల్లి జెండర్ మార్చేసుకోవలసి వస్తుందని, మగపిల్లలకు జన్మనీయడానికే అమ్మతనం భయపడే దౌర్భాగ్యం సమాజాన్ని ఆవరిస్తుందంటూ రౌద్ర స్వరం వినిపిస్తున్నారు పద్మాశ్రీరామ్ గారు. ఒక మహాబలి ఆడతనాన్ని గొడ్డలి చేసి మదాంధుల తలలు నరికే పరశురాము డయ్యేందుకు కాలం కలిసి రావాలిగా అంటూ అశావాదాన్ని కూడా వినిపిస్తున్నారు. కడగండ్ల ఆడకూతుళ్ళ కన్నీళ్ళు మోస్తూ.. కాకుల లెక్కలేస్తూ... అంతవరకూ ఎదురు చూద్దాం... అంటూ శక్తివంతంగా కవిత్వ రూపంలో సామాజిక దౌష్ట్యం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 'ప్రతిరాత్రీ సమాజానికి ఒక మత్తుగా రానీ యుగాంతం..' అంటూ మహిళకు మాత్రమే సాధ్యమయ్యే శాపాన్ని పెడుతున్నారీమె. 'ఆడతనాన్నే గొడ్డలిగా చేసే మహాబలి...' ఇటీవలి కవిత్వంలో అతి గొప్ప పద ప్రయోగమిది. ఆమె ధర్మాగ్రహం పట్ల సహానుభూతి ప్రకటిస్తూ.. ఈ శక్తివంతమైన కవితను అందరమూ ఆస్వాదిద్దాం.. పోనీ....అంతులేని మృగాలవాంఛలిలానే కొనసాగనీ అప్పుడిక గుళ్ళో దేవతల విగ్రహాలు సైతం భయంతో పరుగెత్తనీ మృత్యుదేవతా నువ్వు సైతం భీతిల్లి జెండర్ మార్చేసుకో వారికడకు పోతే నీ శీలానికి సైతం రక్షణ ఉండదని... అమ్మతనమా మగపిల్లలకు జన్మనీయకే ఆడజన్మనెత్తడానికి సమాజమా అనుమతినీయకే సాగనీ ఈ దురన్యాయం మానవతకు మాయని మచ్చగా రానీ యుగాంతం ప్రతిరాత్రీ సమాజానికి ఒక మత్తుగా ఉపన్యాసాలివ్వనీ ప్రభుత్వాలను ప్రతిరోజూ కొత్తగా జీవో లు జారీ చెయ్యనీ చెత్తబుట్టలు నింపే దిశగా... మారద్దు మనం .... తల్లినీ చెల్లినీ పరాయోళ్ళలో చూడొద్దు... పరాయి ఆడోళ్ళనే తల్లిలో చెల్లిలో చూద్దాం... మనది ప్రజాస్వామ్యం... వావివరసలకు సైతం మనం దూరం... రావాలిగా ఒక మహాబలి ఆడతనాన్ని గొడ్డలి చేసి మదాంధుల తలలు నరికే పరశురాముడయ్యేందుకు... అంతవరకూ ఎదురు చూద్దాం...కాకుల లెక్కలేస్తూ... కడగండ్ల ఆడకూతుళ్ళ కన్నీళ్ళు మోస్తూ...http://ift.tt/1o1Ix5h

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1Ix5h

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి