పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మార్చి 2014, శుక్రవారం

Sateesh Namavarapu కవిత

***ఆత్మావలోకనం.*** నువ్వు పలకరించబోతే.. ఎదుటివారు దులపరించుకుంటే, నువ్వు ఆదరించగోరితే.. వారు చీదరించుకుంటే.. నీకు, వినసొంపుగా పలకరించడం రాక కాదేమో, వారి కంటగింపుగా..నీ వెనుక పరిస్థితులు కావచ్చు.! ఆత్మాభిమానం చంపుకొని,సహాయం కోరదలచినప్పుడు.. క్షోభతో నీ మనసు నలిగిపోవడం కనబడక కావచ్చు.! రోజువారీ వృత్తిలా అడుక్కునేవారికీ, సమస్యల వృత్తంలో ఇరుక్కున్న వారికీ.. తేడా గుర్తించలేక కావచ్చు..! తప్పని పరిస్థితిలో..తప్పని తెలిసినా, తిప్పలు తప్పవని హెచ్చరించిన మనసు చంపుకొని మరీ.. వారి మనసు అందనంత చేయి సాచావేమో ఎప్పుడైనా.. సాయం చెయ్యకున్నా.. అడిగిన పాపానికి అనర్హుల జాబితాలో చేరావేమో..? ..చేసినప్పుడు, ప్రతిఫలంగా నువ్వేమీ చేయలేనప్పుడు..లాభం లేదనుకున్నారేమో..?? అది సరేగానీ..ఇదే పరిస్థితి.. నీ వల్ల ఇంకెవరైనా అనుభవించారేమో.. నీ గుండె కోత సాక్షిగా.. మనసు లోతుల్లోకి తరచి చూసుకో ఓ సారి..!!..14MAR2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1ICGe

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి