పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జూన్ 2014, గురువారం

Yessaar Katta కవిత

.. ఆగష్టు 2012 పదిహేనున హైదరాబాదు “ఇఫ్లూ” లో జరిగిన 'కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్' మన కవిసంగమం ప్రయాణంలో ఓ మలుపురాయి. ఆ పండుగ సంబురాలలో నేనూ పాలుపంచుకున్న సంతోషం నాలోన నిలిచేవుంది. కవిసంగమం అపూర్వ సమ్మేళనంలో నాలో కలిగిన కొన్ని అనుభూతుల్ని అప్పుడే కవిత్వంలా రాసుకున్నా యిది అందరితో పంచుకోలేదు. ఎందుకంటే నేను రాసింది ఆధునిక వచన కవిత్వంలో కాదు. ఆరు కందపద్యాల్లో నాటి నా అంతరంగాన్ని జోడించి రాసుకున్నవి. మన కవిసంగమంలో చేరిన కొందరు క్రొత్త మిత్రులతో ఆనాటి అనుభవాల్ని పంచుకోవాలనే ఉద్దేశ్యంగానే యిపుడు పోస్ట్ చేస్తున్నాను. సురెక || పంద్రాగష్టు 2012 .. ||కం||కవనం కవనం ఐనది కవిజనమంతా మిళింద కటకము కాగన్ కవియించిన రాగాలతొ కవగొనిరానాడు పండుగ దినము జేసీ ! .. ||కం||అలరించిరి గానాలతొ తొలకరి భావాల వాన తొలుకగ బాగా చెలరేగిరి వారందరు ఒలికిన ఆలోచనమ్ము లొడికము కాగన్! .. ||కం||కురిపించిరి రాగాలను మురిపెము జారన్ కవిత్వముదిరము నుండీ విరచించిన గేయాలను పరితము లాగా నుతించి పటిమను జూపీ ! .. ||కం||కవిసంగమమే కోరగ చవిగొని మన్నించె వారు చతురిమ జూపీ కవిమాన్యులు తామందరు కవితల గూర్చీ గణించి కడుగొనిరెంతో! .. ||కం||పదిహేనవ ఆగస్టున కదలిరి వారందరెంతొ కలితము కాగన్ ముదలించిరి వారెంతయొ మదిమది తోనే కవనమ్మలరగ నాడున్ ! .. ||కం||అనురాగముతో కూడిరి అనువును చూపీ కవితల అమరికచేసీ తునికోలగ వారందరు అనఘపు గేయాల మత్తు అనువుపడంగన్! .. (12/06/2014)

by Yessaar Katta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v3AR6a

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి