పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జూన్ 2014, గురువారం

Sharada Sivapurapu కవిత

దీర్ఘాయుష్మాన్ భవ // శారద శివపురపు కనులు తెరిచి చూడగ ఈ శుభోదయాన చీకటి పరదాల అంచుల వెంబడి తొంగి చూసిన పుత్తడి వెలుగులు తట్టీ లేపెనేవో సుదీర్ఘ నిద్రలోనున్న బంగరు భవితల ఆశలు గుర్తుకు తెచ్చెను లేత మావి చిగురులు చూసినంతనే కుహూ కుహు మన్న కోకిలమ్మల సన్నాయి పాట విన్నంతనే చిలిపి ఊహల తేలియాడిన కన్నెపిల్లల తలపించెను నవ వధువు మోమున చిగురించిన బంగరు చిరునవ్వుల అనిపించెను మెత్తని మేఘాల తేరుపై వెడలి చందమామను ముద్దాడినటుల నింగినుండే రంగుల హరివిల్లు వాకిలి ముందే నిలచినటుల పన్నీరు నింపుకున్న మేఘమేదో మెల్లగ మేను తాకినట్టుల నిన్న కాదు మొన్న కాదు గత జన్మల జ్ఞాపకాల గాయాలు వెంటాడిన అంతులేని చీకటి రాత్రులు తెలవారనీకు దేవుడా అని మౌనంగా రోదించిన రాత్రులు తెలవారనిరేయిన దీపమెట్టి సూర్యుని వెదకిన రాత్రులు కుత్తుకకానించిన కత్తులవలె ముప్పిరిగొన్న భయాలు మెత్తగ తొలగించిన వెలుగు పూల పరిమళాలు ఎదలో ఎపుడూ గుచ్చుకున్న ముళ్ళ జ్ఞాపకాలే మరి ఎపుడు పూసెనీ గు భాళించు ఎర్ర గులాబీలు ఎన్నినాళ్ళకీ మనసున వెలుగులు నిండగ ఎంత హాయి తోచె బ్రతుకున ఈ పండగ కనులు తెరిచి చూడగ ఈ శుభోదయాన కలిగిన ఈ భావనకి దీర్ఘాయుష్మాన్ భవ 12/06/2014

by Sharada Sivapurapufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l3C0sx

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి