పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జూన్ 2014, గురువారం

Renuka Ayola కవిత

//చక్రాల కుర్చీ // రేణుక అయోల నిన్నటి దాక నన్ను పట్టుకున్న గోడల చేతులు నేల చేతులు కొత్త అతిధిని చూసి దాచేసుకున్నాయి నిన్ననే శరీరాన్ని చక్రాల కుర్చీలోకి మార్చాలన్నప్పుడు అవి చేతులు దాచేసుకున్నాయి ఈ బండీ రీమోటుతో తిరుగుతుందిట మారుమూలకి నన్ను తోసేస్తూ ఎన్ని జాలి కళ్ళని తిరస్కరించినా లోపలి కళ్ళు జాలిని వదిలి పెట్టావుగా ఉడుములా ఒక్క సారిగా కెరటంలా వచ్చిన ఈ అనుభవంతో నిద్ర సముద్రంగా మారిపోయింది మెలకువ వేకువ ఇసుక తిన్నెల రెప్పల మీద ఆగిపోయాయి ఇంక నేలని తాకలేని పాదాలు పరుగులు పెట్టలేని పాదాలు శరీరంలో కరిగిపోతాయి జ్జాపకాలు లోపల శిలగా మారుతున్నాయి శిలలో తడి కరిగి వేడి ఆవిరి అవుతోంది శిలలో రక్తం మరుగుతోంది శిలలో యవ్వనం గుస గుసలు చేస్తోంది ఇప్పుడు చక్రాలు చప్పుడు చేస్తున్నాయి కాలికి కట్టుకున్న మువ్వల్లా గల్లుమంటున్నాయి గల్లుమన్నప్పుడల్లా నీళ్ళ కుండలని దాచేస్తూ గోడలని నేలని చూస్తూ తిరుగుతున్నాను రేప్పోదునుంచీ అందరితో చక్రాలు కట్టుకుని మాట్లాడాలి చిరునవ్వుని నోటీసు బోర్డులా అతికించుకోవాలి .....

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1xLS0Uh

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి