పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జూన్ 2014, గురువారం

Humorist N Humanist Varchaswi కవిత

//వర్చస్వి//బియాస్// - - - - - - - - - - - - - అప్పుడప్పుడూ స్వప్నాల రెప్పల మధ్య ఓ హరివిల్లుని చూసొద్దామనుకునే ఉల్లాసపు వెల్లువకు ఏదో తెలీని తప్పిదపు ఆనకట్ట అడ్డుపడిపోతుంది! చూస్తుండగానే కంటిలో చలమలు చిన్నగా చిలవలు పలవలై విరుచుకు పడ్డ వరదై కనీళ్ళ చితిని పేరుస్తుంది. కోల్పోయిన లేత కలల్ని వొత్తులేసుకుని వెతికీ వెతికీ వేసారిన కళ్ళు- నివాళిగా వెలిగే కొవ్వొత్తులవుతాయి ! రోజులు దొర్లాక దొర్లిపడ్డ కన్నీటి కెరటాలన్నీ చుక్కలు చుక్కలుగా కాసింత కుదుట పడిపోతుంటాయి. పగిలిపోగా మిగిలిన గుండెల్ని స్మృతులుగా శృతిచేసుకుని జాలిగా నేమరేసుకుంటాయి ! ఎప్పటిలా దీటైన యంత్రాంగం తనపని తాను చేసుకు పోతూ ఎక్కడో మేటవేసిన ఇసుకలో ఇంకి పోతుంది! కుర్రకారుతో పోటీపడి ‘అశ్రద్దా-అప్రమత్తతలు’ పొగరైన వైట్ కాలర్ల నేరాలుగా ఎగురుతాయి. ‘సౌందర్యాన్ని వీక్షించదలచిన కన్ను చిన్న నలుసైనా పడకుండా రక్షించుకోవడం నేర్వాలనే’ అంశం- రేపటి స్కూలు సిలబస్ లో ‘బియాస్’ పాఠంగా వెలిసి తప్పించుకుంటుంది! //12.06.14//

by Humorist N Humanist Varchaswi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oWBJFT

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి