పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జూన్ 2014, గురువారం

Ravela Purushothama Rao కవిత

ఋతులాస్యం రావెల పురుషోత్తమ రావు నేలంతా పూల వర్షంతో పులకితమౌతున్నది నూత్నమర్యాదంజెందుతూ చివురు జొంపాలతో పుడమి మాత పురుడుపోసుకుంటూండడం అంతా వసంతుని లీలా విలాసమేగదా. అవనిమీద నీరంతా క్షణాలలో ఆవిరై యిగిరిపోతున్నది బహుశా ప్రచండభానుని గ్రీష్మతాపం తీరుస్తున్నదేమో ప్రకృతి పరాన్ముఖత పాలవకుండా జాగ్రత్త పడుతున్నది పగుళ్ళ నేలను చూసి గుండెలవిసేలావిలపించిన మేఘం తూనీగలతో దారులు గట్టి వర్షదేవతను మట్టి పరీమళ సౌరభాలతో అద్ది శుభస్వాగతం పలుకుతున్నది పూలరెక్కలన్నింటి పైనా హేమంతపు తుషార బిందు రత్నాలు దివ్యకాంతులతో విరాజిల్లుతూ హరివిల్లుల ననంతంగా అణువణువునా ప్రతిబింబింపజేస్తూ అమందానంద కందళిత సుందర హృదయానందయౌతూ వికసిస్తున్ననేపధ్యమది . నిగారింపులతో పాలకంకులు పాడి పంటల పసిడి తళుకులు, జున్నుమీగడ తరగల్లా మెరిసిపోతున్న పాడి పశువులు పొదుగుకున్న పసిడి కాంతుల ధగధగలు . శరత్ జ్యోత్స్నల సరిగమల ధవళ ధావళ్యాలు. ఆశనిరాశలమధ్యన ఊగిసలాడే నీరవనిశ్శబ్దాలు నిట్టనిలువునా వణికించే నిరాశా నిస్పృహల నిడుగాడ్పులు శిశిర ఝంఝల్లో రాలిపడే నిస్తబ్ధ తరంగాలు ఈ శీర్ణ పత్రాలు. **************************************** 12-6-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lidPW0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి