పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, జూన్ 2014, సోమవారం

Trinadh Meegada కవిత

//సర్వోన్నతం నాన్న // అవని అమ్మ అయితే అంబరమే నాన్న అనంత ఆకాశ అంతరిక్ష పొరల్లో ఎన్నో విస్పటనాలు వెలుగు నొసగే సూర్యులు చల్లదనపు చంద్రులు జీవిత గమనాన్ని నిర్దేశించే గ్రహ గతులు అన్నీ దాచుకున్న అంబరం వంటి గుంబనమైన నాన్న .. ఉరుముల మెరుపుల పెళ పెళలు దాచుకొని చన్నీటి చుక్క ఆశ్రు ధారగా వర్షించే నాన్న . ఎండ కు ఎండి వానకు చిద్రమై బ్రతికించే ఛత్రమే నాన్న .. పైకి కల్లొల కడలిలా వెడలి .. సడలని రత్నగర్భమే నాన్న .. బండను మోసి నిందను కాసి బలిపసువైన నాన్న .. సృష్టి లో సర్వోన్నతమై అన్నింటికన్నా మిన్న నాన్న . ……………………………………………మీగడ త్రినాధ రావు

by Trinadh Meegada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qTs4Bg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి