పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, జూన్ 2014, సోమవారం

Krishna Mani కవిత

ఏమయ్యింది నాకు ? __________________________కృష్ణ మణి ఏమయ్యింది నాకు ? ఇందాకనే చాయి తాగి పేపర్ చూస్తున్న నా శరీరం నేన్జెప్పినట్లు ఇనుటలేదు ఏమయ్యింది నాకు ? ఏమే ! ఎకడున్నావు ఒక్కసారి ఇలా రా .. అని అందామంటే నోరుకుడా లేవట్లేదు ఏమయ్యింది నాకు ? నా చుట్టూ నా వాళ్ళు చేరారు హాస్పిటల్ కి తీసుకెళ్ళండి నన్ను అని చెప్పాలని ఉంది ,కాని ఎలా ? కళ్ళలో కన్నీరయిన రావట్లేదు నోరు తెరుచుకుంది ,పెదవి ముయలేక పోతున్న ఏమయ్యింది నాకు ? వాకిట్లో పడుకోపెట్టారు అయ్యో హాల్లో నైన ఉంటె బాగుండు కనీసం ఫ్యాన్ ఉండేది నన్ను చూసి ఏడుస్తున్న వాళ్ళతో ఏడవకండి అని అనలేక పోతున్న నా భార్య నాపై పడి పడి ఏడ్చి సోమ్మసిల్లింది ఆ ప్రేమను తట్టుకోలేక పోతున్న తనకెవరయిన కాస్త చాయి తాపండి అని ఆనాలనుకుంటున్న నన్ను అర్థం చేసుకున్నట్టున్నారు నా ఆలికిచ్చారు ! నా పిల్లలు నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు ఇంతకు ముందెప్పుడూ ఇలా జరుగలేదు ఒక్కసారి రండిరా అంటే తీరిక లేదు అనే వాళ్ళు పాపం ఇబ్బంది పెట్టనేమో ! అయ్యో నా బందు జనం ఊరు వాడ వచ్చారు అందరు కుశలమేనా ? ఎందుకు అందరు జాలిగా చూస్తున్నారు నేను చలించట్లేదనా ,నన్ను హాస్పిటల్ కి పంపట్లేదు నేనెప్పుడు భాగు పడతాను ? అదేంటి బాజాలు , కట్టెలు , తెల్ల బట్ట , పూలు ఇదేమి విడ్డూరం నాకు స్పర్శ లేదని వేల్లగోడతారా ? వద్దు వద్దు నన్నెత్తొద్దు నాకోసం ఇంతమంది జనాలా ? ఒక పక్క గర్వంగా ఉంది కాష్టలగడ్డ వచ్చింది , దేవుడా ఒకసారి కదిలే శక్తినివ్వు నేను బతికే ఉన్నానని చెప్పడానికి ప్చ్ ! దయలేని వాడు నన్ను ఎగతాళి చేస్తున్నాడు ! కట్టెల నడుమ పిడకలు పిడకల నడుమ నేను మంటల్లో కాలుతూ మసిబారిన చర్మం నా కాయం మాయం అయ్యింది నా అనే ఆనవాలు కనుమరుగయ్యింది ఇప్పుడేమి చెయ్యను ? ఇప్పుడేమి చెయ్యను ? ఇప్పుడేమి చెయ్యను ? ''' ''' ''' కృష్ణ మణి I 16-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lxImPs

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి