పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, జూన్ 2014, సోమవారం

Ravela Purushothama Rao కవిత

మరణ యాత్ర------రావెల పురుషోత్తమ రావు *********************************************** మట్టిని మశానం వైపు తరలించే మహాప్రష్థానం మొదలయింది మనసున్న మనుషులంతా ఈ మరణ యాత్రలో పాల్గొనండి ఆరుగాలాలపాటు అహర్నిశలూ శ్రమించి చెమటోడ్చిన కృషి ఫలితమే గదా దేశ ఆర్ధిక అభ్యున్నతికి ఆసరాగా నిలచింది అన్నపూర్ణయై యింత అన్నం పెట్టగలిగింది ఆమడలదూరంగా ఆకలిని తరమగలిగింది చదువుకునే మగపిల్లల కింత సాయమై నిలువగలిగింది ఆడపిల్లల వివాహాది కార్యాల్లో ఆదరువై ఆదుకుంది పల్లె జీవనం పాడి పంటల పాలిటి సౌభాగ్య లక్ష్మిగా విలసిల్ల గలిగింది ఇప్పుడిక్కడి వాతవరణమే రూపు రేఖలు మార్చు కుంది వడి వడిగా వేడెక్కి వివాదాలకు నినాదాలకు పంట విరామానికి వేదికై నిలచింది ఈసారి గిట్టు బాటు ధర దొరక్క పాలించే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులంతా రోడ్డెక్కవలసి వచ్చింది. వరి కంకులతో గూడిన పనలను తగులబెట్టే స్థితికి దిగజార్చి కృషీవలుల కడుపు మంటకు కారణ భూతమై ప్రవర్తించింది. పంట పొలాలన్నింటినీ పారిశ్రామిక వాటికలుగా మార్చాలని శాసనాలతో ప్రభుత్వ ప్రతిపాదిత సాహత్యా కర్యక్రమం , మొదలయింది మట్టిని పూర్తిగా మశానం వైపు తరలించే ప్రక్రియ ప్రారంభమయింది ప్రణాలికలు సిద్ధమై మహాప్రస్థాన యానానికి మార్గం సుగమమై నిలిచింది . పల్లె తల్లి గోడు గోడున విలపించగా అనురాగాలూ ఆత్మీయతాను బంధాలూ అదృశ్యమయే అంకం మొదలయింది ---------------------------------------------------------------------16-6-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1owgf6X

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి