పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, జూన్ 2014, సోమవారం

Achanta Hymavathy కవిత

సరస్వతీ స్తుతి ------------------------------------------ హాటక గర్భుని రమణి శశి భాస్కర నయని అజ్ఞాన తిమిర హారిణి విజ్ఞాన ద్యుతి ప్రసాదిని. రమా భవానీ -సుర సేవితే! భక్తజన సంస్తుత భరితే! త్రిపురారి శంకర భగిని త్రిజగన్మోహిని జగజ్జనని కంజజుని గేహిని రాణి కలహంస వాహిని వాణి వేదాంత పుస్తక పాణి సుందర బంబర వేణి కళ్యాణీ రాగ నాదప్రియే! పండిత విదుషీ వాదప్రియే! విద్యార్దీ జన మేధాప్రియే! విశిష్ట అధ్యాపక బోధనాప్రియే! వీణాపాణీ -- విద్యాదాయిని, మంజులవాణి మోక్షప్రదాయిని. పుణ్యస్వరూపిణి, మందహాసిని కమనీయ,కరుణార్ద్ర మనస్విని! స్మితానన శారదే - రాగపరిపూర్ణే, శృతి,లయ,తాళ,కచ్చపీ సమ్మోదే, సబ్దాలంకృత దివ్యగాయని మాయే! సాహిత్యామృత పాన పిపాసే!

by Achanta Hymavathy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lymAuY

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి