పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మార్చి 2014, మంగళవారం

Usha Rani K కవిత

మరువం ఉష | అనుసంధానం ---------------------------- ఆ విముక్తాకాశతలాన విలాసంగా విహరించే విహంగం మదిలో అసూయ గుప్పిస్తోంది అప్రయత్నంగా రెక్కగూడు తడుముకున్నాను ఎక్కడో అగాథపు లోతుల్లో మొండి పర్వతం ఇబ్బందిగా కదులుతూనే ఉంటుంది ఊహల్లో ఎగిరే నాకింత అత్యాశ కలిగితే, గతించిన యుగాల్లో సుఖించిన రెక్కజోరు కడలి హోరులా ఊపుతూనే ఉండాలిగా ఈ విశాలభూతలాన విస్తారంగా పరుచుకున్న వనం ఎదలో అనుభూతిని రగిలిస్తోంది అనుకోకుండా కళ్ళు మూసుకున్నాను ఇక్కడే ఎక్కడో శాపవిముక్తి పొందని నిస్త్రాణ దేహమొకటి స్థాన భ్రంశం కోసమని ఆరాటపడుతుందేమో కలలకే అబ్బురపడే నేను, భ్రమణ కాంక్షకి లోనైతే కామరూప విద్యల కలదిరిగిన విలాసాలు శ్వాస నిశ్వాసలుగా ఆయువిస్తున్నాయేమో అనుభవానికి రాని ఆరాటాలు ఆగవెందుకో ఆనవాళ్ళ మాయతివాచీ మీద పయనాలు చేస్తుంటాయి నిదురలోనూ మూత పడని మనసు, మూస్తున్న కళ్ళలో పక్క వేసుకుంటుంది కుతూహలపు కేరింతలతో వింత ప్రదర్శనలు చూసి వస్తుంది 11/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g4CfuN

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి