17, మార్చి 2014, సోమవారం
Sravanthi Itharaju కవిత
ఐతరాజు స్రవంతి"సౌగంధిక జాజరలు" 17.3.2014 "జీవితం ఓ అందాల ఇంద్రచాపం" లేలేత ఊదారంగులాంటి బాల్యంతో వికసించి నీలి నీలంలాంటి కౌమారంలొకి ఎదుగుతూ ముదురునీలాకాశంలాంటి అనంతమైన కోరికల యవ్వనానికి దాసోహమంటూ పచ్చాపచ్చాని గృహస్థాన్ని పంచుకుని పిల్లాపాపలతో పసుపుపచ్చని కాపురం చేస్తూ సంసార సాగరాన్ని ఈదలేక సన్యాస కాషాయం ధరిస్తూ అస్తమించు రవిని బోలు ఎర్రటి వృద్దాప్యంలో ముగుస్తూ వెరసి పంచేంద్రియాల అరిష్డ్వర్గాల చాపల్యమై జీవితం తనే ... ఓ సప్తవర్ణాల ఇంద్రచాపం గా మారె.. సప్త వర్ణ కలయిక "శ్వేత"మైనట్టు మనసును బుద్ధితో స్వాధీన పరచిన సదా కలుగు దైవ సాన్నిధ్యము ఓ మనసా..ఆత్మ పరమాత్మను జేరు వెలిసిపోబోదు వివర్ణమై.. నిర్మలమౌ నిశ్చలమౌ శాంతిని బొందు ఇహ పరముల వినరాదే..
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gsscA3
Posted by Katta
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gsscA3
Posted by Katta
Srinivasu Gaddapati కవిత
//జాతర// ------------------- శ్రీనివాసు గద్దపాటి ------------------------------------------- జాతరొచ్చిందంటే ఊరంతా సందడే రంగు రంగులకండువాలతో ఊరంతా ఒక్కటే కళ ఖద్దరుజుబ్బాలేసుకున్న భుజాలు ఖండువాలతో భళే విచిత్రం పోయినేడు వెలిసిపోయినవి కొత్తరంగులతో హంగామా ఇప్పుడు గోచీలతోనే పేచీ వాగ్దానాల బరువులు మోయలేక వొంగిపోయిన వీపులపైన వరాల జల్లులు కురుస్తాయి అర్థాంతరంగా పుట్టుకొచ్చిన ప్రేమల్లో అమాంతం తడిసిపోతూ... ఉన్నగోచీ ఊడిపోతుంది మూన్నాళ్ళ ముదనష్టపు వర్షం ఆరుగాలం పంటను ఆగంజేసినట్టు గూడేలు గూడేలకీ పోటెత్తుతుంది ఓట్లు నోట్లై కడుపులో దిగుతుంటే భవిష్యత్తు బానిసై బ్యాలెట్ బాక్స్ లో దూరిపోతుంది 17.03.2014 -------------------------------------------------- ----------
by Srinivasu Gaddapati
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eIa45A
Posted by Katta
by Srinivasu Gaddapati
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eIa45A
Posted by Katta
Rvss Srinivas కవిత
|| హోలీ || మకరందపానం చేస్తూ... మాధుర్యాన్ని అందించిన సీతాకోక చిలుకలకి సిగ్గులభారాన్ని లెక్కచేయక... వాటి రెక్కలకి తమ వర్ణాలని అద్దుతూ ప్రతి సుమం నిత్యం ఆడుతుంటుంది రంగుల హోలీ ఉదయకిరణాలను క్షణానికో రంగులోనికి మార్చేస్తూ ప్రతివర్ణాన్నీ తూరుపు సంధ్యకు పులిమేస్తూ అస్తాద్రి చేరుతూ వీడ్కోలు పేరుతో సంధ్యాసుందరి బుగ్గలకి సిందూర వర్ణాలు పూసేస్తూ ఆదిత్యుడు నిత్యం ఆడుతుంటాడు రంగుల హోలీ ప్రతి తరువునీ తపనతో తాకేస్తూ ప్రతి కొమ్మపై రంగుపూలు చల్లేస్తూ పుడమి నిండా సందడి చేస్తూ ఋతురాజు ఆడేది రంగుల హోలీ సంధ్యా సమయాలలో మేఘమాలికలు కురిపించే చిరుజల్లులను ప్రభాకరుని కిరణాల సాయంతో అల్లరి పెడుతూ ఆ నీలాలగగనం ఆడేది సప్తవర్ణాల హోలీ. క్రోధంలో కెంపురంగుని విసురుతూ నవ్వులతో ముత్యపువర్ణంలో తడుపుతూ ప్రేమలో సతతహరితాన్నందిస్తూ నా మదిలో లెక్కలేనన్ని వర్ణాలు నింపుతూ నీవాడేది రంగురంగుల హోలీ...వేల వసంతాల కేళి. ...@శ్రీ 17/03/14
by Rvss Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p14twb
Posted by Katta
by Rvss Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p14twb
Posted by Katta
16, మార్చి 2014, ఆదివారం
Narayana Sharma Mallavajjala కవిత
ఈనాటికవిత-75 _________________________________ బాలు వాకదాని ||బ్రతుకు పోరాటం|| బిందాస్ మాటలన్నీ మనోనిబ్బరంకోసమే, కడుపు నిండికాదు వీధి వీధి తిరిగేది ఆసరాకోసమే, ఆనందం కోసం కాదు అంతర్జాల గోడలపై తగిలించిన బొమ్మలన్నీ పాతవే, కాస్త ఉరటకోసం బాకీ లెక్కల కాగితం గుండెను తడుముతుంది చొక్కా జోబులోనుంచి నా వాళ్ళంతా నిలదీస్తున్నారు నన్ను నిలబెట్టటానికి అణిచిపెట్టిన ఆసక్తినంతా కొలమానాలతో చూపించాలెమో! దగాపడిన హృదయం మరోసారి సిద్దమౌతుంది తాకట్టుకి తగలపెట్టిన ఆదర్శాలు, సిద్ధాంతాలలోనుంచి తీసిన ఆయుధంతో మంచి మనసుని పొడవాలి కావలిసిన దానికోసం కసితో నేన్నుంటే, కాకమ్మ కథలంటారేమో! దారంతా వెతుకులాటే, కాస్త వెలుతురు వేసేవాళ్ళు తోడైతే భావుండు మన:శాంతి, మనోవేదన పట్టింపులేమీలేవు, కాస్త పనుంటే చాలు ఇంతకన్నా సాక్షాలు ఏంచూపను? రూపీకోసం, రోటీకోసం చస్తున్నానని * * * చాల సార్లు కవిత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు మానసిక మైన అంసాల గురించి మాట్లాడుకొవాల్సి వస్తుంది.దాని కారణం వ్యక్తీకరణ అనేక అంశాలని దాటి మనొవైఙ్ఞానిక భూమికతో విరాడ్రూపాన్ని పొందింది. మనషి నిజాయితీగావ్యక్తమవడంలోని సంశయాన్ని,క్రియా రహిత స్పృహని బాలు కవిత్వీకరించారు.యూంగ్ ఉమ్మడి అచేతనల్లొ చెప్పిన అంశాలలొ ఆచ్చాదన ఒకటి.మనది కాని అంశాన్ని పట్టుకుని ప్రవర్తించడం అలాంటిదే.బయటీకి వ్యక్తమౌతున్న తీరుకు అనుభవిస్తున్న తీరుకు మధ్య వ్యత్యాసం ఉంటుంది.ఈ వ్యత్యాసాన్నే కవిత్వం చేసారు బాలు. ఈవాక్యాల్లో నిరాశ,నిరాసక్తత ఉన్నాయి.క్రియాశీల చైతన్య స్పృహ లోపించినప్పుడు మనిషిలోని భావాలు,చైతన్యము ముసుగువేసుకుని ఉంటాయని హెగెల్ అన్నాడు.దారిద్రయం పట్ల నిరసన క్రియాషీల చైతన్యంతొకాక దయ,సానుభూతి,పరొపకారం లాంటి రూపంలో వ్యక్తమౌతుంది.ఆధునికంగా ఇది లొటులేనితనాన్ని అనుభవిస్తున్నట్టు నటిస్తుంది. ఈ ఆచ్చాదననించే బాలు మాట్లాడారు. బాలు వస్తుపరంగానె కాదు.తనదైన వైయ్యక్తిక నిర్మాణ ముద్రకూడా వ్యక్తం చేసారు.బాలు మరిన్ని మంచి కవితలతో తనని నిలబెట్టుకోవాలని ఆశిద్దాం.బాలు వాకదాని కి అభినందనలు
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvlmDv
Posted by Katta
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvlmDv
Posted by Katta
Swarnalata Naidu కవిత
శ్రీస్వర్ణ || నిత్య హోళీ || తెలిమంచుతెరల్లొ నీ ఎదను తాకిన అరుణార్ణవం వర్ణరంజితమై ఇంద్రధనువుకే మెరుగుపెట్టే శతకోటి వర్ణాలు.. నీ మేనికాంతుల్లో ! ఎడారిలో మండే ఇసుకరేణువులకు రంగుల ఆస్వాదనని పరిచయించింది నీలోని పరమాణువుల స్పర్శకి పచ్చికనేలపై జీవంకోల్పోయే గడ్డిపరకపై నీ చెమటచినుకులు జారి సంజీవినిలా ప్రాణం పోసాయి ! గుప్పిట పట్టిన సగంవాడిన సుమాలు నీ హస్తరేఖల్ని కౌగిలించుకుని ఊపిరి పీల్చుకున్నాయి సంతోషంగా ! చీకటి ఎదపై నీ కురుల లాస్యాలు వెన్నెల పొదరిల్లే కట్టింది చంద్రుని భువిపై దింపింది ! నీ నిశ్వాసలు పీల్చి గాలిలోని దుమ్ముకణాలు ప్రకాశవంతమై ప్రకృతికి కాంతిలహరి అందించింది నిస్సారమైన మట్టిలోని పొరపొరకీ రంగుల అద్దకాలే... నీ పాదస్పర్శతో వెలువడే ఆత్మీయకిరణాల పలకరింపుతో విశ్వమంతా రంగులకేళీయే !
by Swarnalata Naidu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvljI5
Posted by Katta
by Swarnalata Naidu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvljI5
Posted by Katta
Thilak Bommaraju కవిత
తిలక్ /వర్ణం ---------------------------- ఇంకా ఎన్ని రంగులు పులుముకోవాలో కొన్ని దృశ్యాలాను ఈ ముఖంలో కప్పెట్టడానికి ప్రతి రోజు కొన్ని వాత్సల్యాలను అద్దుకొని ప్రేమించేస్తావు నగ్నంగా కళ్ళలో నిజాలు గుర్తించలేని సమయాలు ఎన్నో కరుగుతుంటాయి నీ ముందే కనిపించే వర్ణాల వెనుక మబ్బుపట్టిన చీకట్లు భల్లెం దెబ్బకి రెక్కలు విరిగిన కొన్ని కపోతాలు ఇప్పుడిక్కడ ఇంకా రంగులు మారుతూనే ఉన్నాయి ఈ దేహంపైన నీ దేహంలో కలవడానికి. తిలక్ బొమ్మరాజు 16.03.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83NDw
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83NDw
Posted by Katta
Sriramoju Haragopal కవిత
అనామకంగా..... మౌనమొకటేనా సమాధానం చిత్రితరూపసందోహాల స్వప్నావిష్కరణలు మౌనమే భూమ్యాకాశాల మధ్య ఈదులాడుతున్న పురాక్రుత జీవావశేషాలిప్పటికీ మౌనమే భాషకందని భావావేదనల సంక్షుభిత సంకలనాలన్నీ మౌనమే అలా గాలిలో తేలాడుతు రెక్కలతో రంగులువిసిరే సీతాకోకచిలుకలది మౌనమే మాటలన్ని కాలిపోయాక బూడిదైన ఇష్టాలు రహస్యధూమాలై మౌనమే పలకరింపుల పక్షులు తడిసిన ఈకలతో అందరి కళ్ళు తుడిచినంత సేపు మౌనమే నిద్రిస్తున్న అగ్నిపర్వతం వంటి మనసు మేల్కొంటున్నది భూమంతటా పరచుకున్న తెల్లనిచెట్లవేర్లలా నా తలపులు గుండెల్లోకి దిగిపోయాయి కాసేపు విశ్రమించని అలల్లా కొట్టుకుంటున్న వూపిరి మునుం సాగుతున్నది దయా దాక్షిణ్యాలు లేని చీకటిరాత్రుల వైకల్పిక కల్పనా విలయతాండవాల విక్రుతాలు రేపటి లేతచిగుళ్ళకు ఆశల హరితవర్ణాలు అద్దుతున్న మనసు మీద కల్లోలాల ఆసిడ్ దాడి పాదాలు, నేల నెర్రెలుబారి ఎడారులవుతున్న వేసవిబాటల్లో ఒంటరిగా నడుస్తున్న పొద్దు మౌనంగానే, ఎందుకీ మౌనం? కాలం కాలమంతా వసంతోత్సవమై గాలంటే ప్రేమతుషారాల స్పర్శగా రాగాలు తీసే నదులన్నింటిని తీగెలుగా మీటి పాడుతున్న పాటనెక్కి మోయు తుమ్మెదల వాగువెంట ప్రవహించి పోవాలి కాని మౌనమెందుకు ముట్టుకుంటేనే వేలపూలరేకులుగా విరబూసే తోటలో వెన్నెలచెట్లనీడలో పెదవులు కదలగానే మెదిలిన తలపులన్నీ రాసుకున్న కావ్యాలై పోవాలిగాని మౌనమెందుకు వాగ్దానాలడుగను కాని, వాగ్దత్తమై పోయి నలిగిపోకు చెప్పమని కోరను కాని రహస్యమై కుమిలిపోకు 16.03.14
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83KHy
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83KHy
Posted by Katta
Kalyani Gauri Kasibhatla కవిత
కవిసంగమంమిత్రులకు.. సప్తవర్ణాల సమ్మిళిత..నవ వసంతోత్సవ..శుభాభినందనలు
by Kalyani Gauri Kasibhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83Lve
Posted by Katta
by Kalyani Gauri Kasibhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83Lve
Posted by Katta
Murthy Kvvs కవిత
KVVS MURTHY|జ్ఞానీలు-33 భద్రత కోసమో రక్షణ కోసమో సుఖం కోసమో ఆలంబన కోసమో రకరకాల బంధాల్లో చిక్కుకొని.. వీటినన్నిటిని పాము కుబుసం విడిచిపెడుతున్నట్టు విసర్జిస్తున్నపుడు అనిపిస్తుంది ఏ ఆటంకాలు సహింపని అడివి లోని పులి వలెనె ప్రతి మనిషి జన్మించాడు ... తనని తాను ఎంత కట్టడి చేసుకున్నా అంతరంతరాళంలో తానూ ఒక మృగమేనని ప్రతి ఒక్కరికీ తెలుసు... !! ------------------------------------------- 16-3-2014
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fB9XrS
Posted by Katta
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fB9XrS
Posted by Katta
Vani Koratamaddi కవిత
స్వప్నం జ్ఞాపకాల బాష్పాలు అక్షరాలై వర్షిస్తాయి మనసుకైన గాయాలు గేయాలై మిగిలాయి ఒడిపోయిన కన్నీటి కధకు సాక్ష్యాలై నిలిచాయి స్వప్నంలో నీరూపం సాక్ష్యాత్కరిస్తుంది సరదాగామాట్లాడి సంగతులెన్నో చెపుతుంది నమ్మలేకపోతాను నీవులేని నిజాన్ని తెల్లార కుండావుంటే బావుండను కుంటాను భళ్ళుతెల్లారేసరికి గుండెగుభేలు మన్నది గతం నన్ను వెక్కిరించిది గాయం గుర్తు చేసింది తలగడపై తడి గుర్తులు కన్నీటికి ఋజువులుగా మిగిలివున్నా నేను.... బాష్పాలు రచిస్తూ..... వాణికొరటమద్ది 16/3/2014
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdZ10
Posted by Katta
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdZ10
Posted by Katta
Kavi Yakoob కవిత
పసునూరు శ్రీధర్ బాబు కవిత్వం ఈ బ్లాగులో చదవండి : http://ift.tt/NkdZ0Q
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdZ0Q
Posted by Katta
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdZ0Q
Posted by Katta
RajendraKumar Devarapalli కవిత
యువ సాహితీ వేత్తలకు ఒక విజ్ఞప్తి/సూచన. ----రాజేంద్ర కుమార్ దేవరపల్లి,మార్చ్,16,2014 యువ సాహితీ వేత్తలకు ఒక విజ్ఞప్తి/సూచన. అన్ని సభలకు వెళ్ళండి.కేవలం సాహితీ సభలకే పరిమితం కాకండి. ముఖ్య అతిధిగానో,ప్రధాన వక్తగానో పిలిస్తే తప్ప ఏ సభకూ,ముఖ్యంగా సాహితీసభలకు వెళ్ళం,ప్రేక్షక/శ్రోతల్లో కూర్చోవటమా అన్న తలబిరుసు తగ్గించుకోండి. పదిమందితో కలిసే ఏ అవకాశాన్ని వీలైనంతవరకూ వదులుకోవద్దు. గుర్తుంచుకోండి-- సాహిత్యం సమాజం నుంచి పుడుతుంది. సారస్వతం పాఠకుల నుంచి,ప్రజల నుంచి వెలికివస్తుంది. దాన్ని అక్షరాల్లోకి బట్వాడా చేసి మరలా పాఠకులైన ప్రజల ముందు ఉంచటమే మీ ప్రధాన కర్తవ్యం. ఈ క్రమంలో కాగితం/కలం ఎంతో కంప్యూటరూ,కీబోర్డూ ఎంతో మీరూ అంతే అంతకంటే ఎక్కువ సమాజాన్నుంచి ఆశించకండి.ఆశాభంగం చెందకండి.
by RajendraKumar Devarapalli
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdW5r
Posted by Katta
by RajendraKumar Devarapalli
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdW5r
Posted by Katta
Sriramoju Haragopal కవిత
అనామకంగా..... మౌనమొకటేనా సమాధానం చిత్రితరూపసందోహాల స్వప్నావిష్కరణలు మౌనమే భూమ్యాకాశాల మధ్య ఈదులాడుతున్న పురాక్రుత జీవావశేషాలిప్పటికీ మౌనమే భాషకందని భావావేదనల సంక్షుభిత సంకలనాలన్నీ మౌనమే అలా గాలిలో తేలాడుతు రెక్కలతో రంగులువిసిరే సీతాకోకచిలుకలది మౌనమే మాటలన్ని కాలిపోయాక బూడిదైన ఇష్టాలు రహస్యధూమాలై మౌనమే పలకరింపుల పక్షులు తడిసిన ఈకలతో అందరి కళ్ళు తుడిచినంత సేపు మౌనమే నిద్రిస్తున్న అగ్నిపర్వతం వంటి మనసు మేల్కొంటున్నది భూమంతటా పరచుకున్న తెల్లనిచెట్లవేర్లలా నా తలపులు గుండెల్లోకి దిగిపోయాయి కాసేపు విశ్రమించని అలల్లా కొట్టుకుంటున్న వూపిరి మునుం సాగుతున్నది దయా దాక్షిణ్యాలు లేని చీకటిరాత్రుల వైకల్పిక కల్పనా విలయతాండవాల విక్రుతాలు రేపటి లేతచిగుళ్ళకు ఆశల హరితవర్ణాలు అద్దుతున్న మనసు మీద కల్లోలాల ఆసిడ్ దాడి పాదాలు, నేల నెర్రెలుబారి ఎడారులవుతున్న వేసవిబాటల్లో ఒంటరిగా నడుస్తున్న పొద్దు మౌనంగానే, ఎందుకీ మౌనం? కాలం కాలమంతా వసంతోత్సవమై గాలంటే ప్రేమతుషారాల స్పర్శగా రాగాలు తీసే నదులన్నింటిని తీగెలుగా మీటి పాడుతున్న పాటనెక్కి మోయు తుమ్మెదల వాగువెంట ప్రవహించి పోవాలి కాని మౌనమెందుకు ముట్టుకుంటేనే వేలపూలరేకులుగా విరబూసే తోటలో వెన్నెలచెట్లనీడలో పెదవులు కదలగానే మెదిలిన తలపులన్నీ రాసుకున్న కావ్యాలై పోవాలిగాని మౌనమెందుకు వాగ్దానాలడుగను కాని, వాగ్దత్తమై పోయి నలిగిపోకు చెప్పమని కోరను కాని రహస్యమై కుమిలిపోకు 16.03.14
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdW5c
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdW5c
Posted by Katta
Gubbala Srinivas కవిత
గుబ్బల శ్రీనివాస్ ----।। కూతురు మళ్లీ పుట్టింది ।। ఊపిరి విడిచి మరుభూమి చేరాల్సిన ఆ భౌతికకాయం ఎదురుచూస్తోంది వొళ్ళంతా మృతనేత్రాలు చేసుకుని . ఏ బండల సావాసంలో రాతిగా మారాయో ?ఆ గుండెలు కాలం చేసిన తండ్రి కట్టెను కటిక రాయిగా పడుండమన్నాయి . పంచుకున్న మాంసంముద్ద,పీల్చుకున్న నెత్తురుచుక్క, పెనవేసుకున్న పితృబంధమూ కనీసం పాశంగానైనా మారలేదు . తనువు చాలించి నిర్జీవమైన పార్ధివదేహం పొందింది స్వర్గం బ్రతికి మిగిలిపోయినా .. సుపుత్రుల నిర్వాకం బరించలేక అడుగడుగనా నరకం . చచ్చిన మనిషి పుచ్చిపోడుగా తన మరో పేగుబంధం ఉరికింది ముందుకు కొరివి చేతబట్టి ఆ తండ్రి అంతిమయాత్రకు అన్నీ తానై . కొడుకుల పాపపు నీడ పడకుండా పున్నామ నరకం తప్పించి,కన్నరుణం తీర్చి మరోసారి జన్మించింది ఆ తండ్రికి కొడుకుగా ! (ముగ్గురు కొడుకులు ఉన్నా ఓ తండ్రికి కొరివి పెట్టటానికి ముందుకు రాకపోవటంతో ఓ కూతురు ఆ కార్యక్రమం చేసిన వార్త పేపర్లో చదివి ... ) (16-03-2014)
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PFpT7M
Posted by Katta
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PFpT7M
Posted by Katta
Katta Srinivas కవిత
కట్టా శ్రీనివాస్ || మొలకపాఠం అప్పుడలా అన్నావు అవును నాతోనే నిజంగా అన్నావు. 1. శీతలం శరీరాన్ని ముట్టించిన రోజుల్లో మాటిచ్చావ్ తొలకరిజల్లు పడగానే తిరిగొస్తానని వేసవితాపంతో ఎదురుచూస్తున్నాను నీ రాకకోసం. 2. మొత్తంగా మూసిన పెంకుని తనువుని దాపిన మట్టిసమాధిని బద్దలుకొట్టుకొస్తూ, అదంతా నేర్పిస్తానన్నావు ... ... అన్నావు నీవు తప్పకుండా వస్తానన్నావు. 3. మూటకట్టి మూలన పడేసినా మనసెప్పటికీ వట్టిపోదని గట్టిగా చెప్పేందుకు పరాన్న జీవుల ప్రపంచానికి స్వతంత్రతేమిటో చూపిస్తూ అదంతా పాఠం రాసిస్తాననేశావు ... ... ఇచ్చావు నాకెప్పుడో మనస్పూర్తిగా మాటిచ్చావు. 4. మృత్తికనుండి దేహంలా పొత్తపు గవాక్షాల అక్షరంలా మస్తకపు దారిగుండా ముచ్చటలా బయటికొచ్చి ఆచరణల ఆకులతో ఆకాశాన్నే కాదు, ఆలోచనల పాదులతో భూమండలాన్నీ కూడా పొ దు వు కుం టా న ని, ... ... చెప్పావు నాలోపల మాత్రమే వినిపించేటట్లు ఘంటాపదంగా గుసగుసలాడుతూ చెప్పావు. 5. అబ్బా పగిలింది చెంప వేసవి వేడిలో సైతం ఎదురు చూస్తున్న నన్నెందుకు కొట్టావ్ ? మొలకై నేనే తలెత్తకుండా బులపాటంగా ఎదురు చూస్తున్నందుకేనా? ► 16-03-2014 http://ift.tt/1gpQ874
by Katta Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gpQ874
Posted by Katta
by Katta Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gpQ874
Posted by Katta
Nirmalarani Thota కవిత
కోడికూసిందో లేదో తెలియదుగానీ కమిట్ మెంట్ కంగారుగా లేపింది . .. చీపురుకట్టతో ప్రస్థానం మొదలు గడియారం పెద్ద ముల్లు పరుగెత్తుతోంది చిన్నముల్లు ప్రేయసిని కలుసుకోవాలనే ఆత్రంలో ఇంకా ఇల్లు తుడవాలి..వంట చేయాలి ఇంట్లో మరో మూడు జతల చేతులున్నాయ్ తినిపెట్టడానికి మరో రెండు చేతులుంటే బాగుణ్ణు ఒకటి ఇంటి పనికీ.. మరొకటి వంట పనికీ రెండు హాల్లోకి మరో రెండు కిచెన్ లోకి క్షణాలు పరుగెడుతున్నాయ్ నిమిషాలుగా మారిపోవాలని స్కూలుకెళ్ళి పిల్లలకి టిఫిన్ బాక్స్ ఇవ్వాలి ఆఫీసుకెళ్ళాలి మరో రెండు కాళ్ళుంటే బాగుండు ఆఫీసుకెల్తూనే ఐదు నిమిషాల ఆలస్యానికి బాసు ధుమధుమలు పక్క సెక్షన్ నుంచి ఏమైందే అనే పలకరింపు చూపులు రెండు జతల చెవులుంటే బాగుండు రెండు మనుషుల్ని వినడానికి రెండు మనసుల్ని వినడానికీ సీట్లో కూర్చొని పని చేసుకుంటుంటే ఉరుములు మెరుపులు నాలుగు ఫైళ్ళు చూడాలి.. డ్రాఫ్టు రాయాలి వడియాలూ, బట్టలూ తడుస్తాయో ఏమో రెండు మెదళ్ళుంటే బాగుండు ఒకటి ఆఫీసు పనికి మరొకటి ఇంటి ధ్యాసకీ నిమిషాలు పరిగెత్తుతున్నాయ్ గంటలుగా గడవాలని. . పొద్దు వాలిపోయింది శరీరం మూలుగుతోంది పెరట్లో మల్లెమొగ్గలు విచ్చుకుంటున్నాయ్ రెండు ముక్కులుంటే బాగుండు ఒకటి అలసిన నిట్టూర్పులకు మరొకటి ఆశల ఉచ్వాసలకూ గంటలు పరిగెత్తుతున్నాయ్ రోజులుగా మురవాలని . . పక్క మీద నడుం వాల్చగానే ఆలోచనా మేఘాలు తరుగుతున్న సత్తువ పెరుగుతున్న పిల్లలు రెండు జతల కళ్ళుంటే బాగుండు ఒకటి కన్నీళ్ళకు మరొకటి కలలు కనేందుకు నిద్ర రాని రెప్పలు నిద్రపోనివ్వని పక్కలు రెండు మనసులుంటే బాగుండు ఒకటి కష్టపడడానికి మరొకటి ఇష్టపడడానికీ ఒకటి క్షమించడానికి మరోటి ప్రేమించడానికీ రోజులు పరిగెత్తుతున్నాయ్ సంవత్సరాలుగా మిగలాలని . . అర్ధరాత్రి దాటిపోతుంది తనువు మనసు స్తబ్ధమవుతున్నాయ్ రోజుకు మరో రెండు గంటలుంటే బాగుండు నాకోసం నేను బ్రతకడానికి . . సంవత్సరాలు పరిగెడుతున్నాయ్ జీవితాలవ్వాలని . . పడమటి సంధ్య తొంగి చూస్తుంది రెక్కలొచ్చిన పక్షులు గూటికి తిరిగి రాలేదు . . రెండు జన్మలుంటే బాగుండు మళ్ళీ తల్లిలా పుట్టడానికి మరో ప్రపంచానికి జన్మనివ్వడానికి . . మామూలు మనిషి అవయవాలతోనే పుట్టి కూడా మరమనిషిలా.. ఇంటా బయటా పనుల్నీ , మనుషుల్నీ, మనసుల్నీ గెలుస్తూ ముందుకుపోతున్న నన్ను నేను చూసుకొని మురిసిపోవడానికీ. . ఆడజన్మ పై గర్వంతో ఉప్పొంగడానికీ. . ! ! నిర్మలారాణి తోట [ తేది: 16.03.2014 ]
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoiLnq
Posted by Katta
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoiLnq
Posted by Katta
Nirmalarani Thota కవిత
కోడికూసిందో లేదో తెలియదుగానీ కమిట్ మెంట్ కంగారుగా లేపింది . .. చీపురుకట్టతో ప్రస్థానం మొదలు గడియారం పెద్ద ముల్లు పరుగెత్తుతోంది చిన్నముల్లు ప్రేయసిని కలుసుకోవాలనే ఆత్రంలో ఇంకా ఇల్లు తుడవాలి..వంట చేయాలి ఇంట్లో మరో మూడు జతల చేతులున్నాయ్ తినిపెట్టడానికి మరో రెండు చేతులుంటే బాగుణ్ణు ఒకటి ఇంటి పనికీ.. మరొకటి వంట పనికీ రెండు హాల్లోకి మరో రెండు కిచెన్ లోకి క్షణాలు పరుగెడుతున్నాయ్ నిమిషాలుగా మారిపోవాలని స్కూలుకెళ్ళి పిల్లలకి టిఫిన్ బాక్స్ ఇవ్వాలి ఆఫీసుకెళ్ళాలి మరో రెండు కాళ్ళుంటే బాగుండు ఆఫీసుకెల్తూనే ఐదు నిమిషాల ఆలస్యానికి బాసు ధుమధుమలు పక్క సెక్షన్ నుంచి ఏమైందే అనే పలకరింపు చూపులు రెండు జతల చెవులుంటే బాగుండు రెండు మనుషుల్ని వినడానికి రెండు మనసుల్ని వినడానికీ సీట్లో కూర్చొని పని చేసుకుంటుంటే ఉరుములు మెరుపులు నాలుగు ఫైళ్ళు చూడాలి.. డ్రాఫ్టు రాయాలి వడియాలూ, బట్టలూ తడుస్తాయో ఏమో రెండు మెదళ్ళుంటే బాగుండు ఒకటి ఆఫీసు పనికి మరొకటి ఇంటి ధ్యాసకీ రాత్రయింది శరీరం మూలుగుతోంది పెరట్లో మల్లెమొగ్గలు విచ్చుకుంటున్నాయ్ రెండు ముక్కులుంటే బాగుండు ఒకటి అలసిన నిట్టూర్పులకు మరొకటి ఆశల ఉచ్వాసలకూ పక్క మీద నడుం వాల్చగానే ఆలోచనా మేఘాలు తరుగుతున్న సత్తువ పెరుగుతున్న పిల్లలు రెండు జతల కళ్ళుంటే బాగుండు ఒకటి కన్నీళ్ళకు మరొకటి కలలు కనేందుకు నిద్ర రాని రెప్పలు నిద్రపోనివ్వని పక్కలు రెండు మనసులుంటే బాగుండు ఒకటి కష్టపడడానికి మరొకటి ఇష్టపడడానికీ ఒకటి క్షమించడానికి మరోటి ప్రేమించడానికీ అర్ధరాత్రి దాటిపోతుంది తనువు మనసు స్తబ్ధమవుతున్నాయ్ రోజుకు మరో రెండు గంటలుంటే బాగుండు నాకోసం నేను బ్రతకడానికి . . పడమటి సంధ్య తొంగి చూస్తుంది రెక్కలొచ్చిన పక్షులు గూటికి తిరిగి రాలేదు . . రెండు జన్మలుంటే బాగుండు మళ్ళీ తల్లిలా పుట్టడానికి మరో ప్రపంచానికి జన్మనివ్వడానికి . . మామూలు మనిషి అవయవాలతోనే పుట్టి కూడా మరమనిషిలా.. ఇంటా బయటా పనుల్నీ , మనుషుల్నీ, మనసుల్నీ గెలుస్తూ ముందుకుపోతున్న నన్ను నేను చూసుకొని మురిసిపోవడానికీ. . ఆడజన్మ పై గర్వంతో ఉప్పొంగడానికీ. . ! ! నిర్మలారాణి తోట [ తేది: 16.03.2014 ]
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oZJ06G
Posted by Katta
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oZJ06G
Posted by Katta
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)