పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Kalidas Darla కవిత

:::::::: వసంతం :::::::::: ఎంతని చెప్పనూ.... నా.. తలపులన్నీ నీ చుట్టూనే.. నిన్ను తలచినంతనే మనసు వసంతమవుతుంది. కాలం ఇసుకతిన్నెలపై చిరుగాలి గీతల్లాంటి నీ జ్ఞాపకాల సంతకాల్ని పదే పదే తడిమి చూసుకుంటుంది హృదయం, వలపు వాకిట్లోకి వచ్చి వయసు దోసిట్లోకి, అనురాగపు అమృతాన్ని వయ్యారంగా వోలికిస్తావు.. నువ్వు. నవ్వులు నువ్వు రువ్వావో... చిరు నవ్వే నువ్వయ్యావో... అర్ధంకాని అయోమయంలో ముంచేస్తావు తడిసిన పూలవనం పసిడి వెలుగుల వేకువలో మెరిసినట్లు లక్షలాది నక్షత్రాలు ఓకేసారి వెలిగినట్లు అద్భుతానికి ఆకృతి నువ్వు, ఎన్ని యుగాలుగా పోగైన అందమో ఇది ఎంత తలచినా కలతే... ఎంత చూసినా వెలితే.... దోసిళ్ళకు ఎత్తడం కుదరదు దోచుకుపొవదమూ సాధ్యపడదు అల్లుకుని,ఆఘ్రాణించుకుని,ఇక్యమైపోతే తప్ప ఆస్వాదించడం కుదరదు.

by Kalidas Darla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bBmMF5

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి