పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Ravela Purushothama Rao కవిత

సంధానం ***********రావెల పురుషోత్తమరావు నిన్నటిదాకా నేను ఎదురయిన ప్రతి వాడినీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేసాను. కప్పదాటు జవాబులతో కొందరు వినీ వినబడనట్లు నటిస్తూ, మరికొందరు నేనుకనబడగానే దివాంధుల్లా నటిస్తూ తడబడుతూ, దారిమర్చేవారు , ఇంకొందరు. ఎవరూ నాప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేకుండా పోయారు. అందుకేకొన్నాళ్ళు నేను ఆప్రశ్నలను వాటి మానాన వాటిని వదిలేసి మౌన్నాన్నశ్రయించాను ,మహర్షిలా. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది అందరూ నన్ను ప్రశ్నల తో మూకుమ్మడిగా అదేపనిగా, దాడి చేస్తున్నారు. భావికాలపు జీవనగతిని గూర్చి నిజం చెప్పండంటూ నిలదీసి నిలువునా వేధిస్తున్నారు. అనూహ్యమైన ప్రశ్నల జడిలో నన్ను అన్యమనస్కం గావిస్తున్నారు అమ్మయ్య ఇప్పుడు జనంలో చైతన్యం, ప్రవాహంలా ఉరకలెత్తుతున్నది అబ్బబ్బబ్బో నన్ను ఎనలేని ఆనందం ఆర్ణవమై ముంచేస్తున్నది . చిరకాలపు నా వాంచ చిత్రంగా నెరవేరుతున్నది. సమాధానాలతో సంధానమై నిలువెల్లా, పులకించి పోతున్నాను 05-02-2004 -----------------------

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWq9Ju

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి