పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Chythenya Shenkar కవిత

చైతన్య || "Little things called ♥ " ------------------------------------- నే కరిగి పోవటం బహుశా నువ్వెప్పుడూ చూసుండక పోవచ్చు.... చూసే అవకాశమూ ఇక రాకపోవచ్చు!!! నువ్వెళ్ళాక పర్చుకున్న చీకటిని తరిమేందుకు నన్ను నేను ఎన్నిసార్లు వెలిగించుకున్నానో... ఆ వెలుగులో నిన్ను నే చూసుకుంటూ ఓ వైపు .. మైనానై బాధగా కరిగిపోతూ మరో వైపు... ఈ క్షణాలకు జాలిలేదు నన్ను అమాంతం మింగేయాలన్న ఆతృత తప్ప!!!! నీ ప్రేమ వర్షం నాపై కురిసే ముందు... నీ చూపుల దారులలో నే మొలకెత్తాను!!! చిగురించాను!!!! పుష్పించాను!!!! ఒక్కో క్షణం ఎండుటాకులా రాలిపోతుంటే.. ఆశావాదం లో ముంచి అంటించుకున్నాను.... కానీ ఏం లాభం!! ప్చ్.... యుగాలు వేచాను... క్షణాలలో నన్ను దాటెల్లిపోయావ్!!!!! నేను నువ్వైపోవాలని నా ప్రేమను నీకు చెప్పేందుకు నీకోసం రోజుకో పువ్వేడ్చేది!!! నువ్వులేవిపుడు!!! ఇకపై రోజూ నేనే ఏడ్వాలి.... నువ్వు ఋతువైనా బావ్వున్ను!!!! తిరిగోస్తావనే ధైర్త్యం....చిగురిస్తానన్న ఆశ ఉండేవి... నీకేం తెలుసు?? రోజూ నీ జ్ఞాపకాలు.... ఎన్ని సార్లు నన్ను చిద్రం చేసి వెళ్తాయో!!! నే కోల్పోయినదేంటో... నన్ను దాటి వెళ్ళిపోయే రాత్రులకు తెలుసు!!! నీవై ఉదయించిన నా జీవితం లో నిన్నటికి -రేపటి కి మధ్య.... ఈ రోజింత ఇరుకుగా ఉందెందుకో!!! నాలోని నిన్ను అడిగేది ఒక్కటే... ఒక్కసారి రాలేవా??? నా నమ్మకాన్ని అబద్దం చేసేందుకైనా!!! 07/02/14

by Chythenya Shenkar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e8wCLe

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి