పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నీవు....: నిశీది వేళ నిబిడాంధకారంలో నన్నల్లుకుని పెనవేసి చుట్టేసిన సన్నజాజి తీగేవు నీవు.. వేగుచుక్క పొడిచి వేకువ పొడసూప తమకమ్మున నా మెడను పామిన ముదితవు నీవు.. భానోదయపు లేలేత కిరణాలకు సుతారముగా నా కౌగిలిని వదలనంటూనే వదిలిన వనితవు నీవు.. స్వప్నమున రేరాజును గని కలల ప్రపంచమున విహరించు నాకు సంధ్య కెంజాయన తేనీటి సౌరభాలు అందించు దేవేరి నీవు.. అరుణారుణమును దాల్చిన నుదుటి సింధూరముతో సకల శుభప్రధాయినియయి ఎదుట నిల్చి సుప్రభాత గీతికలు పలుకు సుదతి నీవు.. పలుకులో కులుకువై పదంలో మలుపువై పాటలో తేటవై పల్లవిలో ఎద మల్లియవై బ్రతుకు బాటన బృందావనిని పరిచిన పూబాల నీవు.. అహరహము శ్రమియించి విశ్రాంతి యన్నది మరచి విలాసాల మేడను నిర్మించిన విధుషిమణి నీవు.. ఎంత చెప్పినా తరగని కల్పనా రీతులకు వన్నెలను కూర్చిన కావ్య ప్రబంధపు కవితా నాయిక నీవు.. ఏం చెసినా చెరగని ఋణబందపు అనుబందమై మమతల సామ్రాజ్యాన్ని వెలయించిన మానినీమణి నీవు.. 07/02/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cb54VG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి