పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Surya Prakash Sharma Perepa కవిత

"మలినం లేని ప్రేమ" -వేదాధ్యయ [06-Feb'14] మలినం లేని ప్రేమ పొందాలనుకుంటున్నావా!! మలినం లేకుండా ప్రేమించు. ద్వేషపు మరకలు పడతాయి అనుమానపు బూడిద అంటుతుంది కాచి శుభ్రం చేసుకో సున్నితమైన ఆలోచన సబ్బుతో... పురుగులు కొరుకుదామని మాటువేస్తాయి వద్దని నచ్చజెప్పు, మందలించు ప్రేమతో... చంపుదామని చూస్తున్నావా!!? వాటి బంధువులొస్తాయి జాగ్రత్త, పగతో... ప్రేరణ లేక చిరుగులు పడతాయి. అల్లెయ్ నీ ప్రేమను మనసుపెట్టి పవిత్రమైన సమయ మగ్గాన్ని అందుకుని, మేలు జాతి సహన దారాలతో... మలినం లేకుండా చూసుకో నీ సహజ ప్రణయ వస్త్రాన్ని. మలినం లేని ప్రేమకై నీరీక్షణలో నీ పాత చర్మం రాలిపోనీ వేయి కాంతులతో కొంగ్రొత్తగా నీ ప్రేమ చర్మమై చేరేవరకు మలినంతో నిన్ను చేరిన ప్రేమ నిన్ను తాకినంతనె శుభ్రమైపోతుంది. మలినం లేకుండా ప్రేమించు నేస్తం! మలిన రహిత ప్రేమను ఆస్వాదించడానికై...

by Surya Prakash Sharma Perepafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itd0Gt

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి