పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Ramabrahmam Varanasi కవిత

పిల్లారాయాష్టకము వారణాసి రామబ్రహ్మం 6-2-2014 ౧. కల్లోలిత సరసిని కనిపించదే ప్రతిబింబము నిలువదు సంక్షుభిత హృదయమున నీ మూర్తి మదినిండ నిండి నెమ్మది నిమ్ము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౨. నాసికాత్రయంబకమున నాజూకుగా మొదలై మరటాంధ్ర సీమల ఏరుల సెలయేరుల కలుపుకు నదిగ మారి భద్రగిరి రాముని పాద పద్మములకు పాద్యమై పున్నెములప్రోవై పట్టిస వీరభద్ర స్వామిని చుట్టుముట్టి అఖండ గౌతమై అన్నపూర్ణయై గోదావరి లవణాబ్ధిని కౌగలించుదరి నుంటివి ప్రసన్న వీక్షణముల ప్రపంనుని కావుము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౩. సిద్ధి బుద్ధి పతివి నీవు శ్రీవల్లి దేవసేనాపతి తమ్ముడు; మంచి బుద్ధుల సిరుల సంపత్తుల నిచ్చి బ్రోతురు మమ్ము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౪. సంసారపు బండిని లాగు మాకు బాడిబందల దారిని కాడి భారమయ్యె కలతల వడిని అలజడిని బాపుము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౫. విలసిల్లును సదా పూవుల పిందెల కాయల నారికేళ వృక్షము కళ కళలాడును గృహములు సదా పిల్లలు పాపలు పెద్దలతో తళతళలాడును మీ మోము మామ్ము కాచుతరి భళి! భళి! పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౬. భావముల వరుసయే మనసు; నిరంతర కామ భావనయే మన్మథుడు; ప్రియమెప్పుడు మదిని మెదలుటయె వలపు; తలపుల సదా మీరుండుటయే భక్తి! పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౭. మీరు లేనే లేరని నాస్తికులు, అంతట మీరేనని ఆస్తికుల తగవులాటలు మొదటినుండీ శంకిసుమంతయును లేని నమ్మకము కుదుర్చుడు పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౮. జగమంతయును అల్లకల్లోలములు హాహాకారములగ నున్నది దేవుని పేరనే జరుగుచున్నవి దారుణములు మతముల మతులు సరిచేసి మమ్ము కాచుడు పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! తటిల్లతా సమరుచి గాత్రి తల్లి పార్వతి అనుంగుపట్టీ! అనుగ్రహము చూపి వ్రాయించితివి నాచేత నీ అష్టకమును వ్యాసమౌని మేటి వ్రాయసకాడా! ప్రీతితో గొని దీనిని బ్రోవుము నన్ను సమస్తవిద్యా ప్రదాతా! సకల విఘ్నాన్తకా! ఈశ్వరకుమారా! ఐశ్వర్య కారకా! పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kW3c9h

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి