పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, జూన్ 2014, బుధవారం

Sriramoju Haragopal కవిత

సామాన్యశాస్త్రం కాలం కన్నీళ్ళను తమ పెదాలతో తొలగించి వాటి జాగలో తమ కన్నీళ్ళనుంచి బాధపడేవాళ్ళు కాలం గుండెలనుండి కష్టాలను త్రోసిరాజని తమ దుఃఖాలను దాచుకుని నవ్వేవాళ్ళు కాలం విచిత్రాలను తమబతుకుటద్దాల్లో పట్టి అమాయకంగా తమలోకి తాము ముడుచుకుని బతికేవాళ్ళు సామాన్యులు వీళ్ళకూ కన్నీళ్ళకు, విస్మయాలకు చాలా ఆప్తత వీళ్ళతో నిర్విన్నత, నిస్సహాయతలు ఆత్మీయంగా వుంటాయ్ వీళ్ళ కథలు పాతపురాణాలు పునరావృత జీవనవృత్తాలు వీళ్ళ బాధలు పురాతన నదులు తర, తరాల కాలాలు నదులు కడలిని చేరిన తర్వాతే తుఫాన్లై విరుచుకుపడతాయి గతాన్ని ఊడ్చుకుపోతాయి (రచన కాలంః 07.08.1978)

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pj1yUr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి