పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, జూన్ 2014, బుధవారం

Lanka Kanaka Sudhakar కవిత

సాంబ్రాణిధూపం --------------------డా.యల్.కె.సుధాకర్ తలారబోసుకోవడం భలే తమాషాగా వుంటుంది.. ఉదయాన్నే నల్లమబ్బులు తెల్లని సూర్యుడి కబుర్లు తీయగా వింటునట్టూ ఇంకా తడి ఆరని కవిత్వప్పంక్తుల్ని అనుభూతుల లేయెండలో ఆరేసుకున్నట్టూ పూయబోయే సన్నజాజులకోసం ఇప్పుడు కొమ్మల్నిసిధ్ధం చెస్తున్నట్టూ తలారబోసుకోవడం భలే తమాషాగా వుంటుంది... మళ్ళీ మొదలైన మరోరోజుకినాటి మహాసంగ్రామంలో-సమూహంలో ఒంతరిగా కనబోయేస్వప్నాలకోసం దిగులు పొదల దారిని సరాళం చెసుకుంటున్నట్టు ఆ అమ్మయి కురులు చిక్కులు తీసుకుంటుంటే తలారబోసుకోవడం మహా తమాషాగా వుంటుంది... తలంటోసుకున్న అమ్మకి సాంబ్రాణి ధూపం కోసం నిప్పులు రాజేసిన గొప్ప బాల్య జ్ఞాపకం గుండెల్లొ వెచగా గుబాలిస్తూ వుంటుంది. చిక్కులు తీసుకున్న జుత్తుని సవరం కోసం దాచుకున్నట్టు బల్య జ్ఞాపకాల్ని మాలగుచి ధరించుకుంటున్నాన్నేను... నాళ్ళోడూతోన్న నల్ల మబ్బుల్లోంచి నవ్వుతూన్న ఇంద్రధనస్సుని ముచ్చట పడి ముచ్చట గా చూడడం మరింత హాయిగా వుంటుంది...

by Lanka Kanaka Sudhakarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mHxD1G

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి