పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, జూన్ 2014, బుధవారం

Pardhasaradhi Vutukuru కవిత

అతివ అంటే ఎంత గౌరవమో మన జాతికి ధరిత్రి అని భూమాత అని పూజిస్తాం ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని సంబరపడతాం భగవంతుని మరో రూపు ప్రకృతిని కూడా స్త్రీ తో పోలుస్తాం నిజంగా అంతటి గౌరవం దక్కుతోందా వారికి ?? కేవలం వంట ఇంటి కుందేలు భావాలు మారాయా ?? భర్తతో సమానం గ ఉద్యోగం చేసి వస్తే విశ్రాంతి ఉంటోందా ?? తెలిసిన వ్యక్తితో పరిచయం గ మాట్లాడితే తట్టుకోగలుగుతున్నారా ?? కొన్ని కుటుంబాలలో అందరు వున్నా ఒంటరే కదా తన భర్త ఇంటిలోనే నివసించే అతిధి తన ఇంటిలో ఉంటున్న మనోభావం చెప్పుకోలేని అందమైన రిమోట్ వస్తువు ఎన్ని కష్టాలు వచ్చిన ఒక్క చిరునవ్వుతో మాయం చేసే దేవత అని ఎపుడు తెలుస్తుంది కోట్లు వున్నా పలకరింపు మాత్రమే కోరుకునే అమాయకురాలు అని తెలిసేది ఎప్పుడో యత్ర నార్యస్తు పూజ్యతే ... తత్ర రమంతే దేవత వేద వాక్యం మాత్రం కాదు .. అక్షర సత్యం సోదరులారా !!పార్ధ !!11/6/14

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uUQuwG

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి