పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, జూన్ 2014, బుధవారం

Jagadish Yamijala కవిత

పరవాలేదుగా ఇవి.... ----------------------------- మాట్లాడేందుకు ఎంతో ఉంది కానీ ఈ మౌనం నచ్చింది --------------------------- రాతిలో బుద్ధుడు ఉండొచ్చు అలాగే రాయే బుద్ధుడుగానూ ఉండవచ్చు ---------------- ప్రపంచంలో ముఖం చూసుకున్నాను నన్నూ అందంగా బ్రహ్మాండంగా చూపుతోందీ లోకం ---------------------- కొన్ని ప్రశ్నలకు ఫలానా దిశ అంటూ చూపితే చాలు తానుగానే జవాబు చూసుకుంటాయి -------------------- ఎంతో మాట్లాడింది నక్షత్రం .... కానీ వాటిని రాసుకోలేకపోయాను, తెల్లవారిపోయింది ------------------------- తమిళంలో మా మిత్రుడు రాజా చంద్రశేఖర్ రాసిన వాటిని నేను తెలుగులో మీ ముందు ఉంచాను......... యామిజాల జగదీశ్ 11.6.2014 ------------------------------

by Jagadish Yamijalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mHxCLb

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి