పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, జూన్ 2014, బుధవారం

Pulipati Guruswamy కవిత

తేనెటీగల తాళం ఒక్కోసారంతే నీకూ నాకూ మధ్య తాళం కప్ప తెరుచుకోదు మొరపెట్టు కోవడానికి ఎవరూ ఉండరు వేరే తలుపులు తెరిచే పని లో నిమగ్నమౌతారు తిరిగి తిరిగి ఆలయం మెట్ల మీద నా పాదం మోపగానే హనుమంతుడు తోకముడుచుకొని నవ్వుతాడు శబ్దాలకు తట్టుకోలేక సాయినాధునికి నిద్రాభంగమవుతుంది ఎవరి కొబ్బరికాయో నాకు ప్రసాదమౌతుంది ఎక్కడో తప్పిపోయిన స్వంతులను వెతుకుతూ వెతుక్కుంటూ మందకొడిగా నడుస్తుంటాను చిన్నప్పటి పైసలు పోగొట్టుకున్న భయము అమ్మమ్మ పొట్టగిన్నె తో తాపిన కుంకుమపువ్వు గోర్జం వాసన ఇప్పుడు వెంట వస్తే బాగుండనిపిస్తది ఎంతకీ తలుపులు తెరవనీయని జీవితమ్మీద వాతలు పెట్టే తాత వెళ్లి పోయాడు పోతూ పోతూ తాళంచేతుల గుత్తి గురించి పొగమాత్రమైనా చెప్పలేదు మనుషుల్ని తెరవటం గురించే ఆలోచించి మదనపడి భంగపడి గీరుకపోయి చివరికి జ్ఞాపక శక్తి మీద బోలెడు ద్రావకం పోసి భుగభుగ నురుగుల దుఃఖం తో కిటికీలు గుండా తొంగి చూసే వాళ్లని కలుసుకోవాలని ధ్యాస తాళం తీసే మంత్రమే తెల్వదు విచిత్రంగా ప్రతిముఖం మీద అదే ఒకటే వాత్సల్యం బాధ పుండు లాంటి రొద అసలీ జీవితపు తాళాలు తెరుచుకునే మార్గమేదైనా ఉందా....? ..... 11-6-2014 ి

by Pulipati Guruswamyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pk59S9

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి