పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Surya Prakash Sharma Perepa కవిత

-వేదాధ్యయ "ఓటు" \18-04-2014\ ---------------------------------- ఎగిరే పక్షికి నూకలను నిప్పుల కుంపటిమీద వడ్డించే అన్నదాతలు ఒకవైపు పచ్చటి పైరుపై సింధూర కీలలు రేపిన విప్లవయోధులు మరొకవైపు... మంటలు ఆర్పేందుకు నీళ్ళు లేకుండా చేసిన అపర భగీరథులు వేరొక వైపు... ఇదుగోరా నీళ్ళు అని ఎండమావులు చూపించే ఎడారి గాలులు ఇంకోవైపు రావోయ్ యువకుడా... వచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేయ్ అని... కోటి అడుగుల హోర్డింగు లాంటి మన ప్రజాస్వామ్యానికి ఊతం కర్రలు పీకేసి నిలబెట్టిన ఘనుల పద్మవ్యూహం లోకి... నా ఓటు అర్జునుడై వెళ్ళి వస్తుందో... అభిమన్యుడై పరమపదించి, ఇంకో ఐదేళ్ళ తర్వత మళ్ళీ జన్మెత్తుతుందో...

by Surya Prakash Sharma Perepa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hTQIAF

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి