పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -5 ----------------------------------------- పౌరసత్వంపై మచ్చ - - - - - - - - - - - - - యాకూబ్ కోపం, దు:ఖం, కసి... మాహినది మాత్రం గంభీరంగానే పడవల్ని మోస్తూ సాగుతూ పోతోంది ఫర్లాంగు దూరమైనా లేదు, సలీం భాయ్‌ చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగిన పిల్లలు మంటల్లో కాలిపోయిన లింఖాడియా సెంటర్‌ హాహాకారాలు, ఆర్తనాదాలు డెబ్భైనాలుగు దేహాల చావు భయంతో బిక్కచచ్చిన ఆకాశం, తానే పాపం చేశానో అని ధ్వంసమై విలపిస్తున్న ట్రక్కు ట్రక్కునిండా మిగిలిన అస్తికలు, పుర్రెలు, వెంట్రుకలు మారణహోమమా దారుణకాండా సజీవదహనమా, అమానుషమా పేరేమైనా పెట్టండి మనిషిమ మీది నమ్మకం మళ్ళీ చెదిరిపోవడానికి మళ్ళీ మరో ప్రారంభం 2 గదుల్లో తెల్లటి కఫన్‌లు చుట్టుకున్న భార్యలు నమ్మకద్రోహాన్ని ఇంకా నమ్మలేక భర్తల్ని పోగొట్టుకొని దు:ఖపుగూళ్ళుగా మారిన ఆ ముస్లిం స్త్రీల కళ్ళల్లో ఇంకా చెరగకుండా మిగిలిన భయానక దృశ్యాలు కళ్ళలోంచి చెరిగిపోలేక కన్నీళ్ళై కదులుతున్న శవాలు 3 నేనేం చేశాను నా చిన్ని మేక పిల్ల ఏంచే సింది నా శరీరంలో కోర్కెల్ని తీర్చే ఒక మర్మాంగం కూడా ఉందని తెలియని దాన్ని నాన్నల్లాంటి వాల్ళే గునపాల్తో పొడిచినట్లు నా దేహాన్ని పొడిస్తే నేనింకా ఈ పచ్చి గాయంలాంటి దేహంతో ఎక్కడికెళ్ళి ఆడుకునేది మా ఇల్లు, మా అమ్మ, నాన్న తమ్ముడూ మీ కైనా కనిపించారా? ఎవరూ కన్పించరేం ఈ ఒక్క మేకపిల్ల తప్ప కాలిపోతున్న ఇంటిలో విసిరేసినా ఎలా బతికానో- మనుషుల్ని చంపడం అనే విద్య ఏ బడుల్లో నేర్పిస్తారో నాక్కొంచెం చెప్పండి 4 అమ్మమ్మల్లాంటివాళ్ళని రేప్‌ చేయడం మీకు తెలుసా? మా గుజరాతీలకు తెలుసు ధర్మాలను ప్రచారం చేసే వాళ్ళకు కూడా కోర్కెల్ని ఎంత వికృతంగా తీర్చుకోవడమో తెలుసు బాబులూ- డెబ్భై ఏళ్ళ నా జీవితంలో హిందూ ముస్లిం, సిక్కి, ఇసాయి అందరం కలిసిమెలిసే ఉన్నాం అక్కా చెల్లెళ్ళలా ఉన్నాం వీళ్ళెవరూ మళ్ళీ మనల్ని ముద్దాయిలుగా చిత్రించి మా హక్కుల్ని కాలరాచే ప్రయత్నం మొదలు పెట్టారు? వీళ్ళెవరూ మా మట్టిమీది సహజీవన వెలుగును మాకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మా వీధుల్లో సూర్యాబాయి, విక్టోరియా, అమీనాబేగం ఎప్పుడూ ఒకరికొకరం ప్రాణ సమానం మీ దోస్తీని గౌరవించే మతాల్లాగే మేమూ ఉన్నాం ఇప్పుడెందుకు నా దేహం మీద 'రేప్‌ హింస'లా ఈ గాయం ఈ గాయం కారణం రాజకీయమా నిజంగానే మత మౌఢ్యమా! నా దేహమ్మీది ఈ మచ్చ నా దేశం నాకు ప్రసాదించిన గౌరవ పతకమా! 5 పిల్లలకు దాహం వేస్తే పెట్రోలును మీరెప్పుడైనా తాగించారా పరుగెత్తుతున్న మనవాళ్ళ దారుల్లో ముళ్ళను మీరెప్పుడైనా పరిచారా అమ్మ చంకల్లో పొదువుకున్న చిన్ని పిల్లల్ని మీరెప్పుడైనా మంటల్లోకి విసిరారా కత్తులతో కోసి ముక్కలుగా తరిగి కుప్పలుగా రాసిపోసి దేహాల్ని తగలబెట్టారా ఇళ్ళల్లో సిలిండర్లను లీక్‌ చేసి ఇంటిల్లిపాదిని పేల్చేసే గమ్మత్తయిన ఆటను మీరెప్పుడైనా ఆడారా గర్భస్థ పిండాన్ని పెరికి తీసి త్రిశూలాలకు గుచ్చి మీరెప్పుడైనా ఊరేగించారా మర్మాంగాల్లో రాడ్లు జొనిపి హింసించడం మీకు తెలుసా! ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయించి, నిప్పెట్టడం మీకు వచ్చునా! పొలాల మధ్యకు పారిపోయి ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు పుట్టమన్ను తినిపించడం ఎలాగో తెలుసా? దాహానికి సొమ్మసిల్లే పిల్లాడికి పక్క పిల్లాడి 'ఉచ్చ' తాగించడం అనే విద్య మీకు ఎక్కడైనా నేర్పించారా! ఊరులేకుండా చేయడం, ఇల్లు లేకుండా చేయడం, ఆప్తులు లేకుండా చేయడం, అమ్మనాన్నలు లేకుండా చేయడం, అసలు తానెవరో తెలియకుండా రుజువులన్నీ లేకుండా చెరిపేయడం, భయపెట్టడం, బతుకు బండలు చేయడం ఎలాగో రాజ్య ప్రాయోజిత కార్యక్రమం ఒక్కో రాష్ట్రంలోనూ ప్రవేశపెడుతుందో- తీరిగ్గా కూచుని ఎదురు చూద్దామా! షాజహానా, అమీనా, నసీంబానులను తమ రాయబారులుగా పంపుతోంది అహ్మదాబాద్‌ కాలిన మొఖాలతో, చీలిన దేహాలతో ఎంతకీ నిలవని రాక్తస్రావంతో సబర్మతీనది గడ్డకట్టుకు పోయిన దు:ఖంలా ఒక చుక్క నీరులేక నగరం మధ్య స్తబ్దంగా మిగిలివుంది 'సబ్‌కో సన్మతి దే భగవాన్‌' 'గాంధీ తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది' ఏ సత్యం నిత్యం జరుగనున్నదో భగవానుడు ఏ సన్మతి కోసం తన చిట్టాలు సరిచేసుకోవాలో ఇంక తికమకల చర్చల మధ్యనే కూర్చున్నారు కాబోలు 6 నేనో ముస్లింనని, నేనో హిందువునని, నేనో క్రిస్టియన్‌నని తరచి తరచి ఇంకా అందని స్వేచ్ఛ మధ్య వెతుకులాడుకునే సన్నివేశంలోకి తోసేస్తున్నారెందుకు నేనూ ఒక మనిషినని గర్వపడేందుకు మన పిల్లలకోసం ఒక విశాల విశ్వం ఎదురు చూస్తూ ఉంది (సశేషం) (AZAAN -Poetry on Gujarat Genocide -2002)

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lgzlbp

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి