పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Kamal Lakshman కవిత

మా ఆసరా చిత్ర సౌరభాలు లో విజేత గా నిలిపిన నా కవిత... స్వేచ్చా భారతం....... ఈ అనంత విశ్వంలో మా దేశ ఘనత అపూర్వం, అమోఘం, అనిర్వచనీయం ఎక్కడా లేని స్వేచ్చా, స్వాతంత్ర్యాలకు మారు పేరు మా ఘన భారతం స్త్రీ ఆదిశక్తి,యని, పరాశక్తి యని అడుగడుగునా అందలమెక్కించటం స్త్రీలను గౌరవించటం, మహిళలకు పెద్ద పెద్దపీటలు వేయటం మా రివాజు పవిత్రత, పరిశుభ్రతల గురించి అను నిత్యం ఊదరగొట్టటం మా నైజం ఎదుటి వాళ్ళ తప్పొప్పులను గమనించటం, నిశితంగా పరిశీలించటం నీతులు చెప్పటం, ఆదర్శాలు వల్లించటం ఇది మాకు మాత్రమే చెల్లిన వైనం ప్రతి రోజూ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని దుయ్యబట్టం మా జన్మ హక్కు నిజానికి.... మా ప్రజా ప్రతినిధులకు జేబులు నింపుకోటానికే తీరిక లేదు పాపం మా మహిళలు విమర్శింటం, చీదరించుకోవటం, మరిచిపోవటం షరా మామూలే ఇక్కడ అనునిత్యం ఇలాంటి దృశ్యాలు అడుగడునా తాండవించచటం మాకు పరిపాటే అయినా ఘనత వహించిన మా భరతావని చరిత సదా శ్లాఘనీయమే... కమల్ 18.04.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r3zRes

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి