పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Pusyami Sagar కవిత

!స్రవంతి గారు రచించిన కధల సంపుటి !మనసు తలుపు తెరిస్తే ..! పుస్తక సమీక్ష !! _____________పుష్యమి సాగర్ మీరు ఎప్పుడైనా కధలు చదివారా..కధల సంపుటిని గుండె కు హత్తుకొని అందులో ని అక్షరాలని ముద్దాడారా..అసలు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలియటం లేదా..? అయితే ఈ "మనసు తలుపు తెరిస్తే "ని చూడండి. మీకు తెలియకుండానే మీ మనోఫలకం పై ఈ కధలు తమదైన ముద్ర ను వేస్తాయి ..స్రవంతి గారు వృతి రిత్యా ప్రభుత్వ ఉద్యోగి అయిన కుడా, ప్రవృత్తి ...రిత్యా మంచి కళాకారులు ..వారి జీవితం లో ఎదుర్కొన్న వివిధ సామాజిక అంశాలను క్రోడీకరించి 18 కధలు గా మనకి అందించారు మనసు వైద్యం చేసే వారు ఎవరు ...ప్రశ్న వచ్చినప్పుడు ...తప్పక ఒకరు గుర్తుకు వస్తారు వారె ... సైకాలజిస్ట్ , మరి .ఏమి చేస్తారు ...చితికిపోయిన లేదు ..పగిలిపోయిన మనసు అద్దాన్ని తిరిగి అతికించాలని ప్రయత్నం చేస్తారు ..ఈ పుస్తకం లో ప్రతి కధ లో కన్నీటి చలమలున్నాయి ...మనసు మెలిపెట్టే విషాదాలు ఉన్నాయి ...ఇవి సంతోషం గా ముగింపు ఇవ్వడానికి సినిమా కాదు ...నిజ జీవితాలు పాత్రల్లో ఒదిగి ఆకట్టుకున్నాయి.. సగటు ఆడపిల్ల పెళ్లి గురించిన కలలు, తను కట్టుకున్న అందమైన సౌధాలు ఒక్కసారి గా కుప్పకూలితే ..ఏ బందువు లు అయితే అదృష్టవంతురాలు అని నేత్తికేక్కిన్చుకున్నప్పుడు కలిగిన ఆనందం, బొట్టు చెరగ్గానే ఆ నవ్వులు దూరమైతే , ఆవేదన సముద్రం లా ఉప్పొంగిధి ..నిరాశ నిండిన జీవితానికి మానసిక తోడూ దొరికినపుడు కలిగిన ఆనందాన్ని "plutanic love" లో ఎంతో బాగా చెప్పారు .. "platanic love is a type of love which is friendly and affectionate, but not sexual" ఇందులో కధానాయకి తనలా కుంగి పోయిన ఆడవారిని చేరదీసి "destitute home" ని స్థాపిస్తారు ..(platanic love, page 14). 18 కధలలో ప్రతి ఒక్క కధ లో ఒక్కొక్క మానసిక రుగ్మత కు సంబిందించిన వివరాలను క్లుప్తం గా చర్చించారు ... పిల్లలు పెద్దలను చూసే నేర్చుకుంటారు, అది మంచి అయిన, చెడు అయినా వారి ప్రవర్తన పై ప్రభావం చూపుతుంది ..ఇదే విషయాన్ని !the man in her life! లో విశదీకరించారు . పిల్లలో కలిగే హింసా ప్రవృత్తి కి గల పలు కారణాలను ను చూపెట్టారు ..!Juvainal Deliquancy!..అంటే బాల నేరస్థుల్లో కనిపించే హింస ప్రవృత్తి, మరి అలాంటి వారిని ఎలా దారి లో కి తేవాలో సూచనలు ఇచ్చారు ... భర్త అనే వాడిలో లోపాన్ని కప్పి పుచ్చి ఒక బిడ్డ కోసం, ఎంత దుర్మార్గమైన కూడా సహించింది ...ఆఖరికి తండ్రి లాంటి మామ గారు తనను పాడు చెయ్యబోతే ఆ విషయాన్ని అటు భర్త కి చెప్పలేక, అత్త కి చెప్పలేక తనలో తానె కుమిలి మధనపడి బాధలు పడింది ...తన కోరిక తీర్చలేదని మామ తన పిల్లాడని ఎలా మార్చాడు...ఆ బందనం లో నుంచి పిల్లవాడిని ఎలా కాపాడుకోన్నది . !భుజం పై పడ్డ మా మామ గారి చెయ్యి ఆక్రమించుకోవాలని చూస్తుంది ., మనుషుల మీద , మానవ సంబందాల పైన అసహ్యం కలిగే లా చేసింది ...! (The man in he rlife, page 1) ఇప్పుడు మనం ఉన్న సమాజం లో పెద్దలకే కాదు , చిన్న పిల్లలో కూడా మానసిక రుగ్మతలకు గురి కావడం చూస్తూ వున్నాం..(ఆణిముత్యం) కధ లో Aatisum తో బాధ పడే పిల్లవాడి గురించి చెప్పారు "..ఈ మానసిక వ్యాధి లో మొదటి లక్షణం వారిని వారి పేర్ల తో పిలిచినా పలకపోవడం, కనీసం ముఖం లో ముఖం పెట్టి చూడకపోవటం ...ఎటో చూస్తుండడం లాంటివి ! (ఆణిముత్యం, పేజి 26) ఒక లోపం శాపం గా దేవుడు ఇచ్చినపుడు అదే చేత్తో వరం కూడా అనుగ్రహిస్తాడు అంటారు/ ఈ ఆణిముత్యం కధ లో కూడా రుగ్మత వున్నా కూడా పిల్లలు అద్భుతమైన నైపుణ్యాన్ని వెలికి తీసి సాన పెడితే వజ్రాలు గా మెరుస్తారు అని సారంశం .. కంచె చేను మేస్తే ? అందమైన పువ్వు లాంటి ఆడదాన్ని తన బందువులు అనుకున్నావారే కాలరాయాలని చూస్తే ఏమి చేసింది ...చిన్నతనం లో జరిగిన అత్యాచార ప్రయత్నం ప్రతి క్షణం జీవితం లో గుర్తుకు వచ్చినప్పుడు లా వణికిపోయే సగటు ఆడపిల్ల వేదన ఇందులో మీరు చూడొచ్చు "శృతి నువ్వు అంటే చాల ఇష్టం...చాల అందం గా వుంటావు ...నీ పిన్నికేమో ఇంకో ఆరు నెలలు దాక పనికి రాదు ...రా ...నీకు స్వర్గం చూపిస్తా ..కావాల్సినవన్నీ కొని పెడతా...అంటూ ఆక్రమించుకొబోయాడు " (నీడలేని ఆడది , పేజి 33) ఇదే కధ లో చిన్నప్పుడు బాల్యం లో జరిగిన అత్యాచారాన్ని ఎదుర్కొన్నాక , కాలేజీ లో ప్రేమిస్తున్న అంటూ కోరి చేసుకున్నవాడు , ఆ ప్రేమ అంతా నటన అని తెలిసినపుడు, తనని అంగడి వస్తువు గా వాడుకొని !సాని కొంప ! కి అమ్మినపుడు ..., ఆ నరకం లో 6 వత్సరాలు వుండి, భయకరమైన H.I.V తెచ్చుకొని జీవితం చరమాంకం లో మరణం కోసం ఎదురు చూస్తుంది నాయకి ..., అప్పుడు అప్పుడు కష్టాల్లో వున్న వారికి దేవుడు సాయం చేస్తాడు కాబోలు ...అది @షావుకారు రూపం లో అవకాశం ....వస్తుంది , ఇందులో కధానయకి కధ విని మానవత తో తన తో తీసుకెళ్ళి ""సహజీవనం "" చేస్తూ తను కోల్పోయిన ప్రేమని ...ఆదరణ ని ఆ షావుకారు పంచి ఇచ్చారు చివరకు తన తుది శ్వాస వరకు తన లా జీవితం బుగ్గిపాలయిన జీవితాలకు ఆలంబన గా ఆశ్రమాలనీ నెలకొల్పడం ....ఆత్మవిశ్వాసం తో నీ ఏది అయిన సాదించగలరు అన్న నమ్మకాన్ని కలిగించిది ... " మగాడు ఎంత వయసు వాడు అయితే అంత అనుభవం వస్తుందే ...పిచ్చిదానా ...నీకేం కోరికలున్నాయి చెప్పు ...తీరుస్తా..! (నీడలేని ఆడది ) !ఏయ్, ఎంటే తెగ పోజు కొడుతున్నావు ...నీ మొగుడే ...నిన్ను నాకు 50 వేల కు అమ్మేసాడే..ఇప్పుడు నువ్వు నా సొత్తు ..పద .!! !కట్టుకున్నోడు ...ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు అక్కడినుండి నన్ను వేశ్యా వాటిక కు తీసుకెళ్ళి అమ్మేశాడు ..దాదపు ఆరు సంవత్సరాలు అక్కడ నరకం అనుభవించాను ..!" (నీడలేని ఆడది ) !ముఖ్యం గా శరీరం మలినం అయింది అన్న చింత కన్నా, ఆ రాజశేఖర్ నా మాజీ భర్త చేసిన గాయం నా హృదయాన్ని తోలిచేసింది ....(నీడలేని ఆడది , పేజి 37).... ఇలా ప్రతి ఒక్క కధ లో మీకు జీవితం కనిపిస్తుంది ..ఇవి అన్ని నిజ జీవితం లో జరిగినవి ..కేవలం పాత్రల పేర్ల ను మార్చి ఇందులో చేర్చడం జరిగింది .....మరొక ఎపిసోడ్ లో మరో కొన్ని కధలను చూద్దాం అప్పటివరకు వేచి వుండండి .... (సశేషం ) ధన్యవాదాలు ...!!! ఏప్రిల్ 18, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jdEwWL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి