పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Bhaskar Kondreddy కవిత

kb ||భేతాళం|| ఎప్పటిలాగే మనిద్దరం కలసి అలా కూచుంటాం ఆ మెలికలు తిరిగిన చెట్టు మొదలువద్ద ఎప్పటికి కదలలేని ఆ బండ మీద. నీ కిష్టమైన ఓ పుస్తకాన్ని పట్టుకొని, నేను చదవడం మొదలుపెడతాను, ఒక్కో వాక్యాన్ని మరింత అర్థవంతంగా పలకడానికి ప్రయత్నిస్తూ, అప్పుడప్పుడు నీ వైపుకి చూస్తూ. ఓ చిన్నపాటి చిరునవ్వుని చెదరనివ్వకుండా, మోకాళ్ల మీద చేతులేసుకొని, బంగారు బుగ్గలను, భుజాలకాన్చి మెత్తని కనురెప్పలతో కనులను మూసి, ఒక్కో కవితనో, కథనో పూర్తిస్థాయి శ్రవణానందంతో ఆస్వాదిస్తుంటావు, అలల్లా కదులుతున్న కురుల సాక్షిగా. నా విషయం కాస్తా పక్కన పెట్టినా, నాకు తెలుసు, నువ్వు దీన్ని ప్రేమిస్తావని. పూర్తయిన పుస్తకాలగుట్టల్లో ఏముందోగాని, నీతో కలసి ఇలా గడపడంలోనే నా జీవితముందని, నాకు తెలుసు. --------12/2013-------------------18/4/2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFCEpf

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి