పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఏప్రిల్ 2014, శనివారం

Sriram M Sriram కవిత

(సారంగ సాహిత్య పత్రిక, మే 2014 సంచికలో ప్రచురితం) // అధివాస్తవ విస్మృతి // శ్రీరామ్ ఈ నిరామయ సాయంత్రాన ఎవరిని గుర్తుకు తెచ్చుకొని రోదించను? ఎత్తైన ఈ రెండు పర్వతాల మద్య లోయలో గుబురుగా ఎదిగిన పొదలతో నా ఒంటరి సమాధి కప్పివేయబడివుంది మెల్లగా, భ్రమలాగా మేఘాలు భూమిని రాసుకొని వెళుతున్నాయి ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు ఈ రోజెవరో నా అజ్ఞాత సమాధి మీద రెండు పుష్పాలు ఉంచారు రెండు కన్నీటి బొట్లూ రాల్చారు ఆమె ఎవరో గుర్తులేదు ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ గుర్తు లేదు http://ift.tt/1pAG468

by Sriram M Sriram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pAG468

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి