పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఏప్రిల్ 2014, శనివారం

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట-2 _________________ఆర్క్యూబ్ అరె నిల్చోనియ్యది..కూర్చోనియ్యది పంటే పండనిత్తదా ఉండేకాడ ఉండనిత్తదా ఒక్క చిత్తమేడుంటది అడ్డంగా..దిడ్డంగా పక్కగోలు..బొర్ల బొక్కలా ఎట్లపండు పక్కమీద ఒక్క భంగిమా సక్కగ కుదరది పక్క పదిమంది పన్నట్టైద్ది గని నిద్రవట్టది పై పన్నాయే నొప్పి-పన్నూ కన్నూ కంతలు ఏ కంచెలడ్డు ? దుంకి మెడకాయ పడ్తది పెయ్యిని ముల్లెగట్టి మూలకు పడేత్తది పంటి పాచిబోతే ఇంటి హీనం బోద్దని పక్క పంటి నుంచి పంటోపదేశం ఎంత మండాల్నో అంత మడ్డుద్దిగని ఏంజేస్తం తప్పు మనది పంటి పంటికీ సందిచ్చినంక పక్క పొంటోల్లకు సందు దొరకదా ఖర్మ !

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hwreYI

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి