పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఏప్రిల్ 2014, శనివారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఓటేస్తే చూపు లేని వారికి కళ్ళిస్తాం నడవలేని వారికి కాళ్ళిస్తాం ఇల్లు లేని వారికి భవంతినిస్తాం విద్య లేని వారికి డిగ్రీ పట్టాలిస్తాం పొలం లేని వారికి ఊర్లే ఇస్తాం స్థలం లేని వారికి పట్టణాలే ఇస్తాం ఉపాధి లేని వారికి ఉద్యోగాలు లేని వారికి ప్రపంచమే రాసిస్తాం ఆరోగ్యం లేని వారికి రోగమే తీసేస్తాం చనిపోయిన వారిని బ్రతికిస్తాం మాకు ఓటేస్తే మీ బ్రతుకులే మార్చేస్తాం ఇదీ ఎన్నికల వరాల వరస! ఓటేశాకా మీకు మా చెయ్యి ఇస్తాం అది అంతర్లీనంగా ఉన్న వాళ్ల మనసులో ఉన్న భరోసా! మన ఓటుతో వాళ్ళ భవిష్యత్తుని నిర్మించుకుంటారు....... మనల్ని మన ఖర్మకి వదిలేసి మన ఆశాసౌధాన్ని కూల్చేస్తారు..... కాబట్టి మనం మన వ్యూహాన్ని పన్నాలి తెలివిగా తప్పనిసరిగా ఓటేయ్యాలి గెలిచిన అభ్యర్డులు మోసం చేస్తే అందరం కలిసి పట్టుకుతన్నాలి వాళ్ళనే మన సేవకులుగా చేసుకుని వాళ్ళ దొంగహామీలతో కాకుండా మన హక్కులతో మన జీవితాల్ని నిర్మించుకోవాలి! అదే మన నిర్ణయం! అదే మన ఆశయం! కాబట్టి ఓటేద్దాం..... ఆనక కనిపిచకపోతే పగబట్టిన సర్పంలా వాళ్ళ మనసుల్ని కాటేద్దాం! 26Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lR4tD1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి