పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఏప్రిల్ 2014, శనివారం

Srinivas Vasudev కవిత

మాయా యాంజిలౌ—ఓ వేశ్యా కవయిత్రి జీవిత కథల పుస్తకం! ------------------------------------------------------------------ ఏ జీవితమూ వడ్డించిన విస్తరి కాదు--ముఖ్యంగా సాహిత్యంలో మనకి కనిపించే చాలామంది కవుల్లో! వారి జీవితాల్లో. ఇది చదివితే మన జీవితాలు ఎంత అందంగా ఉన్నాయో, మనం ఎలాంటి కంఫోర్ట్ జోన్ లో కూర్చుని జీవిస్తున్నామే అనిపిస్తుంది. యాభై అరవై ఏళ్ల కిందటి వరకూ! ఔనూ ఇప్పటికీనూ. ఈనెల అంటే ఏప్రిల్ 2 నే తన86 జన్మదినం జరుపుకున్న ఈమె ఈ వయసులో ఇప్పటికీ ఉత్సాహంగా కవిత్వం రాస్తున్న అమెరికన్ కవయిత్రి, రచయిత్రీ, జర్నలిస్ట్, గాయనీ, ఇలా రాసుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే! ఆమే మాయా యాంజిలౌ Maya Angelou. ఎనిమిదేళ్ళ వయసులోనే తన తల్లి బాయ్‌‌ఫ్రెండ్ చేతిలో ఘోరమైన రీతిలో అత్యాచారానికి గురైన మాయా ఆ తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు మాట్లాడలేదు. ఆమెని మానభంగం చేసిన వ్యక్తిని ఆమె మేనమామలే హత్యచేసారని తెల్సి తను మూగవోయింది. ఆ హత్య గురించి ఆమె మాటల్లోనే " నేనింకెప్పుడూ మాట్లాడదల్చుకోలేదు. నేను చెప్పటం వల్లనేగా మా వాళ్ళు ఆ అబ్బాయిని చంపేసారు. ఇక నేనెప్పుడు నా నోరు విప్పను. బహుశా నేనే అతన్ని చంపేసానేమో, ఇక నేనేం మాట్లాడినా అది ఎవర్నోఒకర్ని చంపుతుందేమో!" అని రాసుకుంది మాయా. మీకు తెల్సా ఈమె తన ఎనభైఆరేళ్ళ జీవితంలొ ఇప్పటికి ఏడు ఆత్మకథలు రాసుకుంది. నాకు తెల్సి మరే సెలబ్రటీ ఇన్ని ఆత్మకథలు రాసుకోలేదేమొ! రికార్డులకోసం కోసం ఇప్పుడు జాలంలో ప్రయత్నించలేను కానీ ఈ సంఖ్యే నన్నూ, మనల్నందర్నీ అబ్బురపర్చే విషయం. ఇన్ని ఆత్మకథల్లో మనం నేర్చుకోవాల్సిందీ చదవాల్సిందీ ఏమైనా ఉందా అని మీరు అడిగితే చెప్పటానికే ఇదంతా...... దాదాపు అన్ని నల్లజాతీయుల కుటుంబాల లాగనే ఈమె కూడా అన్నం మెతుకుకోసం మొహమూ నాలుకా వాచి చివరికి మనసూ వాచి ఆ వాచిన మనసుతోనే అన్ని రకాల ఉద్యొగాలకీ సిధ్ధపడింది. అలా ఆమె చేసిన ఉద్యోగాల్లో చెప్పుకోదగ్గవి- వేశ్యా గృహపు కార్యనిర్వహాణాధికారిగా, వేశ్యగా--ఔనూ వేశ్యగానే-- నైట్ క్లబ్ డ్యాన్సర్ గా, నృత్య రూపకంలో నర్తకిగా, నటిగా, ఇలా చాలా ఉద్యోగాలు చేసిన మాయా తన జీవితంలో ముగ్గురి భర్తలని తన ఒడిలోకి లాక్కునే ప్రయత్నం చేసినా అవేమీ ఫలించలేదు. ముగ్గురికీ ఆమె విడాకులిచ్చేసింది. క్లబ్ డ్యాన్సర్ గానే ఆమె 'ది పర్పిల్ ఆనియన్' లో నాట్యం చేస్తున్నప్పుడు ఆమె కి పరిచయమైన వాళ్లలో టోష్ ఏంజెల్స్ ఒకడు. అతనితో కల్సి ఆమె మరిన్ని ప్రయోగాలు చేసి చివరిగా కాలిప్సో డాన్సర్ గా సెటిలయింది. డ్యాన్సర్ గా చాలా ప్రదర్శనలిచ్చాక దాన్నీ విరమించుకుంది. 1959 లో నవలా కారుడు James O. Killens ని కల్సాక ఆమె తన జీవితాన్ని మరో దిశలోకి ప్రయత్నం చేసింది. ఆమె కూడా నవలలు రాయటం ప్రారంభించి ఆ ప్రక్రీయలోనూ విజయం సాధించింది. 1970 లో ఓప్రా విన్ఫ్రే ని కల్సాక ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. మళ్ళీ పెళ్ళీ, du Feu తో విడాకులూ...1981 లో. అదే ఎడాది ఆమెకి Wake Forest University లో లెక్చరర్ గా ఉద్యోగం. అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారోత్సవం. ఇంతవరకూ జరగని ఓ అద్భుతం. అమెరిన్ ప్రెసిడెంట్ ప్రమాణస్వీకారోత్సవపు సభలో ఓ కవయిత్రి తన కవితని వినిపించటం--అదీ ఓ నల్ల జాతీయురాలు. ఆమెని ఆహ్వానించాడు బిల్ క్లింటన్. ఆమె తన కవిత "On the Pulse of Morning" చదివి ఓ రికార్డేండంటే చెప్పింది. 1961 తర్వాత జాన్ ఎఫ్ కెన్నడీ ప్రమాణ స్వీకారోత్సవు సభలో రాబర్ట్ ఫ్రాస్ట్ చదవమే మనకు తెల్సి మొదటిది. తర్వాతే ఈమెనె. ఐనా బస్ కండక్టర్ గా చేసిన ఈమెకి ఇవన్నీ ఓ పెద్ద లెఖ్ఖనా అని పెదవి విరిచే పనిలో పడకండీ..ఇంకా ఉంది. ఔను మనం ఇన్ని విషయాలని ఓ స్త్రీ జీవితంలో ఉన్నాయా అని తెల్సుకోడానికే ఇంత భయపడితే మరి ఆమె వాటిని భరిస్తూ ఎంత ఆలోచించి ఉండాలి. మరి ఆమె కోసం ఓ మాట చదవటం పెద్ద టైమ్ వేస్ట్ కాదేమొ కదా! బారక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక ఆమె ఇలా అంది "We are growing up beyond the idiocies of racism and sexism". మరి ఆమెని ఈ ప్రపంచం ఆమె తన గతాన్నంతటినీ వదిలేసి ఆమెకిచ్చిన అవార్డ్స్ నీ రివార్డ్స్ నీ చూద్దామా? అన్నింటినీ చెప్పే టైమ్ నాదగ్గరైతే లేదు కానీ ఓ మాట చెప్పి ముగిస్తాను. ప్రపంచంలోని ముఖ్యమైన సంస్థలన్నీ ఆమెని గౌరవించి తమ అస్థిత్వాన్ని చాటుకుని తమకి తామే గౌరవాన్ని ఆపాదించుకున్నాయి. ఆమెకి ముప్పైకి పైగా గౌరవ డాక్టరేట్స్ ఇవ్వబడ్డాయి. ముప్పై!!!!! ఇక మిగతా వాటి గురించి మీరు అడుగుతారని నేననుకోను. చివరిగా ఇది వినండి. గతేడాది సౌతాఫ్రికా మానవాతాది, మాజీ అధ్యక్షుడూ నెల్సన్ మండేలా మరణించినప్పుడు ఆమె రాసిన తన చివరి కవిత "His Day is Done" ఆమె మాటల్లోనె... http://ift.tt/1nNRUVI ఆమె గురించి ఒక్క మాటే నేను చెప్పగలనేమొ.. ఇలా... ఆమె రాసిన కవితల్ని అన్నింటినీ చదివే వయసు నాకు దేవుడిస్తే ఎంత బావుండేది. ఐనా ఆమె గురించిన ఈ వాక్యం చెప్పకుండా ఈ వ్యాసాన్ని ముగించను. “She did not find the process cathartic; rather, she has found relief in "telling the truth" ఇన్ని చెప్పి ఆమె రాసిన ఒక్క కవితనీ మాకు ఇవ్వరా అని మీరడిగితే ఇదిగో ఇదే నా జవాబు: “స్వేచ్చ పిట్ట గాలి వీపునెక్కి ఎగురుతూనే ఉంటుంది కిందకు తనను తాను దింపుకుంటూ గాలినెదిరిస్తూ సూర్య కిరణాల నారింజ రంగుల్లో తన రెక్కల్ని ముంచుకుంటూ ఆకాశం నాదేనంటూంది.....” అని ఆమె రాసిన ఈ కవితని మీరే చదవండి. మీరే అనువదించండి. I Know Why The Caged Bird Sings -------------------------------------------- The free bird leaps on the back of the wind and floats downstream till the current ends and dips his wings in the orange sun rays and dares to claim the sky. But a bird that stalks down his narrow cage can seldom see through his bars of rage his wings are clipped and his feet are tied so he opens his throat to sing. The caged bird sings with fearful trill of the things unknown but longed for still and his tune is heard on the distant hill for the caged bird sings of freedom The free bird thinks of another breeze and the trade winds soft through the sighing trees and the fat worms waiting on a dawn-bright lawn and he names the sky his own. But a caged bird stands on the grave of dreams his shadow shouts on a nightmare scream his wings are clipped and his feet are tied so he opens his throat to sing The caged bird sings with a fearful trill of things unknown but longed for still and his tune is heard on the distant hill for the caged bird sings of freedom. ---------------Maya Angelou

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNRUVL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి