పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఏప్రిల్ 2014, శనివారం

దాసరాజు రామారావు కవిత

\\జంబి ఏప్రిల్ 2014 సంచిక ఆవిష్కరణ (వేముగంటి మురళీకృష్ణ) \\ ---------------------------------------------------- గూట్లోంచి చెల్లా చెదురైన పక్షులు ఎతిమినాన్‌గ ఇంటికి మళ్ళే వేళ ఎండిన వరి చేను వెండి వెలుతురై పల్లెను తట్టి లేపుతున్నది సరం మీద పొట్లం కట్టిన దుఃఖాన్ని నిమజ్జనం చేయాల్సిన సమయమిది చీకటి ఊబిలో కూరుకపోయిన కలల్ని పాతాళ గరిగెతో మెల్లగా పైకి తియ్యాలి ఆకులు రాలిన చెట్టుకింద ఒంటరై జీవిస్తున్న అవ్వల రెట్టల్లో సంతోషాన్ని నింపాలి పందిళ్ళ నిండా బీర తీగల్ని పారించి బతుకులను పచ్చని నీడల కింద నిమ్మళం చెయ్యాలి మొగులును వడికి నీటి ధారలతో కుంటలని, ఒర్రెల్ని, మక్కజొన్న చేన్లని తనివితీర మత్తడి దుంకించాలి మజ్జుగ కదులుతున్న దేహాలతో నమ్మకాల నగారా మోగించాలి చల్లని గాలి కింద వేపచెట్టు పోరడై ఉయ్యాలలూగాలి వలసపదాలు ఇసుకలోంచి బురదనేలలో చిందెయ్యాలి దశాబ్ధాల గాయాలమీద కట్లు కడుతున్న ఉమ్మెత్త చెట్టు ముందు బోనం వండి పండుగ చేయాలి పాలపిట్టకు రుమాల్‌ చుట్టి తెలంగాణ జండ మీద పెద్ద మనిషిలెక్క కూసోపెట్టాలి 26-04-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fiqcRd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి