పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఏప్రిల్ 2014, శనివారం

యాకయ్య వైట్ల కవిత

II యుద్ధం ll 2/04/2014 వైట్ల.యాకయ్య యుద్ధం.. యుద్ధం.. యుద్ధం.. ధర్మం పై అధర్మం.. నీతి పై అవినీతి గెలుస్తున్న యుద్ధం. రాచరికాన్ని తలదన్ని ఆరాచకం చేస్తున్న యుద్ధం. అడవినీతిని మార్చి ఆధునీకరణ చేసిన యుద్ధం. 1 యువత.. దేశ భవిత.. మహాత్ములంటే మాకు లెక్క లేదు.. మేం.. ఎవరికి తక్కువకాదు.. మా తాతలు మాకు గుర్తులేదు మా అయ్యలు మాకు నీతి నేర్పలేరు ప్రేమంటే మాకు కామం కాదంటే నీకు స్వర్గధామం. పిచ్చికుక్క కి నాకు పోలికేలా పట్టపగలు నడిరోడ్డు మీద ఓ పడతిని చూస్తే నే మొరగనెలా. ఆడదంటే అమ్మరా.. నువు ఊపిరోసుకున్న జన్మరా నువు ఎదిగిన పోదివిరా నీ ప్రాణం తనదిరా. నీ ఆకలికి అవ్వెట్టిన బువ్వరా నీ చూపుకి చేదబట్టి విరిగిన చనుపాలురా యుద్ధం.. యుద్ధం... యుద్ధం. నిను ప్రసవించిన, నిను పాలించిన, నిను ప్రేమించిన నీ తల్లి నీ చెల్లి నీ ఆళీ మళ్ళి మళ్ళి ఓడుతున్న యుద్ధం. 2 ఆకలేసి అయ్యాఅని చేయి చాచే షష్టి పూర్తి ముష్టి వాడికి ముద్ద బెట్టె మనుజుడేవడు. ఏవగింపుతో.. ఆవ్వానం మందలింపుతో.. మమకారం, కనులురుముతు.. కరుణ జూపే పన్లునూరుతు.. ప్రేమ పంచె అరచేతిలో చితిని పేర్చి.. అంజనంలో మా అవ్వయ్యను చూపే. అది చూచి హరి నన్ను తోలుకపోయే. నే కట్టిన కప్పమే నాకిచ్చుంటే నా కాళ్ళకి కళ్ళేమేలా? సర్కారే సల్లగుంటే... నా సావుకి సంకెళ్ళు.. ఎలా? యుద్ధం.. యుద్ధం... యుద్ధం.. సంప్రదాయం సాగనంపి.. సంస్కారం సావగొట్టి.. సనాతన ధర్మానికి సావు మేళం వంతపాడి సర్కారు సాగిస్తూ గెలుస్తున్న యుద్ధం. 3 దళితుడేవడు..? దరిద్రుడేవడు..? భేధమేలా వచ్చెను.. కుళ్ళిన బలవంతులె తెచ్చెను. 'ఆది' మనిషి మృగమే.. అనాదిగ ఇది మారని జగమే. కారణం.. ఆకారణమైన ఆకలి ఓంకారుడైన తిర్చేనా ఈ వెతని. ధరలెగసి ధరణి విడిచి దైవాన్ని చేరేనో దయతలచి దేముడే దిగివచ్చెనో దండేసి దండమేట్టి కీలు బొమ్మ చేసెనో. రాజులైన.. రాజకీయులైన.. నీటి మీద రాతలు వారి నోట కట్టిన కోటలు. నివురు గప్పిన నిప్పులు మా బ్రతుకు కాలిక్రింది చెప్పులు మా కాళ్ళు నడవలేని తిప్పలు. యుద్ధం.. యుద్ధం.. యుద్ధం.. ఇది దైవాంశ దరిద్రులపై దురహంకార ధనవంతులు గేలుస్తున్న యుద్ధం. 4 నే మతం మరిగి నా మానవత్వం మూర్చకొచ్చే నే జాతి కోసం నా నిజాయితి నిద్రకెక్కే నే కులమేక్కి నా కాళ్ళు కాటికొచ్చే వర్ణమంటూ వెర్రెత్తి.. వర్గమంటూ విభేదించి.. విధవనైతి. మనిషితనం.. మంచితనం.. నా మనసు పొరలో "మంచు" తనం. వొళ్ళంతా... కుళ్ళే అచ్చం మన "మూసీ" (నది) ప్రవాహమల్లె. యుద్ధం.. యుద్ధం.. యుద్ధం.. జాతి మతం కులం వర్గం వర్ణం వైషమ్యాలతో నను నే ఓడిన యుద్ధం. 5 జననమెవరు.. మరణమేవరు.. జనులెవరు.. ఘనులెవరు.. ధీనులెవరు.. ధీరులెవరు.. క్రూరులెవరు.. కరుణులెవరు.. మదమెక్కిన గజములెవరు.. గతి తప్పని గిరిధరులెవరు.. ఎవరు.. ఎవరు.. మృగములెవరు.. మనుషులెవరు.. గుణమున్న మృగమే మనిషి. నే ఘనమన్న మనిషే మృగము. యుద్ధం.. యుద్ధం.. యుద్ధం.. మనషి పై మనిషి మార్పు కోరుకొని మనిషి.. మనిషివని నమ్మిన మనిషిపై గెలుస్తున్న యుద్ధం. 6 యుద్ధం.. యుద్ధం... యుద్ధం. పొగడకురా నికృష్టపు నీ జాతిని నిగడకురా నిరలజ్జపు నీ ఖ్యాతిని ఇక మిగిలుంది నువోక్కడే అది నువ్వు ఇక్కడే మనిషివని నమ్ముతున్న మార్చమని అడుగుతున్న కర్షకులని కప్పెట్టు క్షుద్రులని కాలరాసే రుద్రుడవైలెమ్ము రాజకీయ రక్కసుల నీతి మాలిన నక్కల నఖశిఖలు నిలువున చీల్చు నరసింహుడవై రమ్ము పరమళించు కుసుమాలకి ఫణి నీవై పడగనిమ్ము ప్రకృతమ్మని పరిహసించే వికృత విశిష్టుల మూల వేరు పెకిలించు సమూలంగ ప్రక్షాళన గావించు యుద్ధం.. యుద్ధం... యుద్ధం.. ధర్మంగా అధర్మాన్ని నీతిగా అవినీతిని అంతు చూసే తంతు నీదే ఆ ఆఖరి అడుగు నీదే. వైట్ల . యాకయ్య 9987841016

by యాకయ్య వైట్ల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iXVzzR

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి