పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Tarun Chakravarthy కవిత

తరుణ్ చక్రవర్తి ॥ కవిత్వమ్... ॥ మనస్సు లోని మూలల్లోన, లోతుల్లోని పొరలల్లోన ఏదో జ్వాలా చలనం, ఇంకేదో ఏదో సంచలనం .. .. కవిత్వమొక సంవేదన, కవిత్వమొక ఆవేదన కవిత్వమొక సంఘర్షణ, కవిత్వమొక సత్యాన్వేషణ కవిత్వమొక బోధన, కావ్య సృజన ఒక ప్రసవ వేదన .. .. కనిపించిన సంఘటనో, మైమరపించిన నటనో, ఎదురొచ్చిన సంకటమో, చుట్టుకున్న లంపటమో .. .. ॥ మనస్సు లొని॥ మది మలయానిలమో, హృది దాగిన బడబానలమో, భూమి పొరలలో జర్రున అలజడులో, సాగర తెరలో గిర్రున తిరిగే పెను సుడులో.. ॥ మనస్సు లొని॥ దారిపక్క గుక్క పట్టిఏడ్చే ఒంటరి పిల్లాడో, చెట్టు కింద నిదురించే అలసిన రిక్షా వాడో వర్షపు బిందువు స్పర్శలతో కర్షక నగవో, ఒంటరి రాత్రులలో గుర్తొచ్చే ప్రేయసి తనువో.. .. ॥ మనస్సు లొని॥ అమ్తర్నెత్రపు గమనపు దారిలో, మెరిసీ మెరవని సినివాలిలో అస్పష్ట రూపాల రేఖా చిత్రం, అగమ్యగోచర జీవన తత్త్వం,.. .. ॥ మనస్సు లొని॥ మనసాంతర్గత జ్వలనం,అంతర్ముఖ లోచన గానం, హృదయపు నిశ్వాసల నమకం, మనసు పలికే సరాగ గమకం ॥ మనస్సు లొని॥ అవును.... కవిత్వమొక సంవేదన, కవిత్వమొక ఆవేదన కవిత్వమొక సంఘర్షణ, కవిత్వమొక సత్యాన్వేషణ .. కవిత్వమొక ఆగని తృష్ణ .... కవిత్వమొక మిగిలిన ప్రశ్న... ... ... కవిత్వమొక బో ధ న, కావ్య సృజన ఒక ప్ర స వ వే ద న .. ..

by Tarun Chakravarthy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g6HePM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి