పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

John Hyde Kanumuri కవిత

నిన్ను ఎందుకో కలవలేకపోతున్నా! ఊరించినదేదో సన్మోహనపరచి ఆనందాన్నేదో నీవిస్తావని రహస్య దారులవెంట నడచి నిన్నుచేరాను నీ అడుగులకు మడుగులొత్తానో నా పాదాలకు లేపానాలే పూసావో ఓ గుడ్డిప్రేమతో నను బంధీనిచేసావు నిన్ను నాలో వొంపుకున్న ప్రతిసారీ మేఘాల పాన్పుపై పవళింపచేసావనుకున్నాను కళ్ళుతెరిచినక్షణం ముళ్ళనుపరిచో,బురదను పక్కేసో నన్ను ఒంటరిగా వదిలేసావు ఈ బాధలు నాకెందుకని ఎన్నిసార్లు అనుకున్నానో!! అయినా మల్లెలు గుభాళించినట్టు పెదవినంటినదేదో పదేపదే గమ్మత్తుగా నీవైపు లాగేస్తుంది వెన్నెలను విడచి చీకటి వెలుతురులమధ్య దోబులాచులాటలతో పాదాక్రాంతుణ్ణిచేసావు వినోదమైన చోటుల్లో చన్నీటిస్నానం చక్కిలిగిలిపెట్టినట్టు స్వరగతులతో చిందేయించావు నేను నిన్ను ప్రేమించాననుకుంటే నన్నాక్రమించి నాట్యమాడిన నీపాదాలు ఆరు పెగ్గులనంతరం వాంతిని పరచి పొర్లించావు సన్మోహాలను తెంచుకోవడానికి నరాలెంతగా విలవిలలాడయో తెలుసా! అందుకే నీ ప్రేమాలింగనాలకు విడాకులిచ్చేసా!! ఎన్నిసార్లు గుర్తొచ్చావో ఎన్నిసార్లు ఎందరితో కబురంపావో నా కోసం ఎంత విరహ సందేశాలంపినా ఎందుకో నిన్ను కవలేకపోతున్నా!! *** (మానేసిన మద్యపానం గుర్తొచ్చి) **12.2.2014** 17:15 ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gthITh

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి