పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Annavaram Devender కవిత

తొవ్వ ..........................అన్నవరం దేవేందర్ చరిత్ర కారుడు జైశెట్టి రమణయ్య ..12.02.2014 చరిత్ర పురుషుడు జైశెట్టి రమణయ్య ఒక చరిత్ర జైశెట్టి రమణయ్య ప్రఖ్యాత చరిత్ర కారుడు .చరిత్ర రచన పరిశోధన లో ఆయన కృషి ఎన్న తగినది .ఇటీవల జూకంటి జగన్నాధం ,నలిమెల భాస్కర్ ల తో కలిసి జగిత్యాల లో ఆయనను కలిసినప్పుడు కరీంనగర్ జిల్లాకు చెందిన చాలా చరిత్ర విషయాలు చెప్పిండ్రు .ఆయన రాసిన ’కరీంనగర్ జిల్లా చరిత్ర –సంస్కృతి ‘అనే పుస్తకం జిల్లా చరిత్రకు ఇప్పటికీ ప్రామాణికం .దీన్నే ఆంగ్లంలో వెలువరించారు .కాలగమనం కోన సముద్రం ‘మరొక చారిత్రక గ్రంధం దీనిని యస్ .జైకిషన్ తో కలిసి వేలువరించిడ్రు .Temples of south India ,The chalukya and kakatiya temples .వీరి మరో పుస్తకాలు . జైశెట్టి రమణయ్య గారు చరిత్ర రచయితే కాదు తాను స్వయంగా చరిత్ర సృష్టించాడు .ఇప్పటికీ యాబైఏ డు సంవత్సరాలుగా డైరీ రాస్తున్నాడు .డైరీ అంటే స్వంత విషయాలే గాదు.ఆనాటి సామాజిక రాజకీయ విషయాలు అందులో ఉంటాయి .పందొమ్మిది వందల యాబై ఏడు నుంచి క్రమం తప్పని అలవాటు .ఇందుకు గాను ప్రపంచ రికార్డ్ లు ఎక్కి గుర్తింప పడ్డారు .అలాగే గత నాలుగు దశాబ్దాలకు పైగా వార్తా క్లిప్పింగులు సేకరించి పుస్తక రూపంలో ఉన్నాయి .తాను రాసిన ఉత్తరాలు ,తనకు వచ్చిన ఉత్తరాలు అతి ముక్యమైనవి పుస్తక రూపంలో బైండింగ్ చేసి ఉంచిండ్రు .Memories of Dr.J.Ramanaiah(autobiography),Prime pastures ,Glimpses ,A book of Invitations ఇట్లా తన జీవితానికి తారస పడ్డయి అన్నీ తను భావి తరాల కోసం భద్రపరిచిండ్రు . మొత్తం భారతదేశం ను చరిత్ర రచన అద్యయనం కోసం తిరిగిండ్రు .ఇక కరీంనగర్ జిల్లా ను చారిత్రక గ్రామాలను అన్నీ తిరిగి అక్కడి శాసనాలు చడువి విగ్రహాలను శోదించి ఏ కాలం ఏమిటి చరిత్ర అని రాసి ప్రకతిన్చిడ్రు .అట్లా గే కోటిలింగాల ఆంధ్రుల తొలి రాజధాని అని అక్కడ శాతవాహన పూర్వపు రాజ్యం ఉన్నదని గుర్తిన్చిండ్రు .చారత్ర నిర్మాణం లో రమణయ్య కృషి చాలా గొప్పది .ఆయన ఇల్లే ఒక మ్యుసియం లాగ ఉంటది .డెబ్బై ఆరేళ్ళ వయసున్న రమణయ్య సారు ను సూస్తే మనకు చరిత్ర రచన పట్ల ఉత్సాహం కలుగుతది.హిస్టరీ రీడర్ గా పందొమ్మిది వందల తొంబై ఆరు లో రిటైర్ అయిన ఆయన కు ఇప్పటికీ సాహిత్యం రచన చరిత్ర రచన అంటే ఇష్టమైన అంశాలు .వేల మంది శిష్యులు ఎందఱో ప్రముఖులు ఉన్నారు . జగిత్యాల అంటే జైత్ర యాత్రే కాదు ఇంకా అక్కడ యాదికి వచ్చేది అలిశెట్టి ప్రభాకర్ తిరిగిన అడుగుజాడలు .బి.ఎస్ .రాములు తాత్విక ఆలోచనలు ,మరియు జైశెట్టి రమణయ్య సారుతో చరిత్ర సంభాషణ .

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1epfS2o

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి