పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || జ్ఞాపకాలు|| ======================== మనసును మంచు ముక్కతో కోసేస్తున్నావ్ రక్తం కారని గాయాలు గుండె పొరల్లో దాగున్నాయి ఎన్నో జ్ఞాపకాలను అదిమి పట్టుకున్ని మనసు పొత్తిళ్ళలో ఒత్తిళ్లను దాచుకుని మంచులా కరిగిపోతున్నాను గాజు పందిరిలో నిత్యం ముక్కలవుతున్నాను ఏదో రోజు దేహాన్ని శాసించాలనే ఆశతో... ఒక్కోసారి మైనం ముద్దలా మారి దారపు వొత్తి తో వెలుగునిస్తూ నిత్యం కరిగి... ఆరిపోతున్నాను చిన్న వెలుతురు జీవనం కోసం ఎన్ని అమవాస్యలైన చిమ్మ చీకటిని నా పౌర్ణమి కిరణాలతో చిదిమేస్తా కృంగుతున్న మనసుకు వారధి కోసం కనురెప్పలను వంతెన చేసి కన్నీరుతో దాటేస్తా! బంక మట్టిలా నన్నొదలని జ్ఞాపకాలు తుమ్మ జిగురులా అంటిపట్టే ఆలోచనలు మెదడుకు స్పీడ్ గమ్ములా అతుక్కుపోతున్నాయి మనసు మాత్రం రక్తం కారుస్తూనే ఉంది నన్నొదలని గతం కోసం! ===================== ఫిబ్రవరి 12-2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1grH6ZD

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి