పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Aruna Naradabhatla కవిత

గాజు బొమ్మ ____________అరుణ నారదభట్ల మనసూ...మనిషీ బహుశా ఎప్పుడూ వేరేనేమో! నేనూ ..నువ్వూ... ఒకేలా ఉంటే నీకూ...నాకూ తేడా ఏముంటుంది!?! అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడల్లా నేను నాలా ఉండాలన్నా పడగనీడలు కురిపిస్తున్న విషవర్షంలో తడిసినప్పుడల్లా ఎవో దారితెలియని మేఘాలు ఉన్నపళంగా కాటుకలా మనసును మసి చేసినప్పుడు పుట్టుకొచ్చే భావ ప్రాకారాలకు ఆవల నిలుచున్నా తెగిపడుతున్న ఆలయ గోపురంలా మనసు ఒక్కోసారి చితికి పోతూనే ఉంది! దీపంలేని గర్భగుడిలో దేవుణ్ణి వెదికే ప్రయత్నం! నిశీధి నిండిన కాలానికి వెన్నెల చల్లదనం...తెల్లదనమూ అంతా సుడిలో చిక్కిన చీకటే! చిన్నపాటి మెరుపులకు ఆగని నక్షత్రం కొంతకాలానికి ఎక్కడో ఓచోట తోకచుక్కలా మిళ్ళుక్కుమనాల్సిందే ఆకాశాన్ని ఊడ్చే చీపురు కట్టలా! ఏరోజుకారోజు శుబ్రపరుస్తున్న దేహంతో పాటూ కమ్ముకుంటున్న మేఘాలను శుద్ధి చేస్తూ దుమ్ము పేరుకు పోయిన మనసునూ దులిపేయాల్సిందే... ముందుకు నడవడం కోసం! 12-2-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j0Y5n8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి