పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || అమ్మను నేను--- అంగడి బొమ్మను కాను ........!! || యుగయుగాలుగా దగాపడుతూ గాయాల గేయాలు పాడే రేమ్మను.....కొమ్మను .. అమ్మను నేను అంగడి బొమ్మను కాను మానవసృష్టికి శ్రీకారమై మూలాధారమై .... ఆకారమై .. ప్రాకారమై ... అలంకారమై ... మీ జీవితాల్ని సాకారం చేసే ..బ్రహ్మను !! అమ్మను నేను అంగడి బొమ్మను కాను అంధకారం ఆవహించినా ... బంధనాలు బాధించినా ... అనుబంధాల మమతల్ని పంచే ... అమ్మను నేను అంగడి బొమ్మను కాను అర్ధరాత్రైనా .... పట్టపగలైనా నడివీధైనా నగరమైనా ... అఫీసైనా ఇల్లైనా................................. అన్నైనా... తమ్ముడైనా .. నాన్నైనా ........... ఎవ్వ డెవ్వడై నా .......... మగాడు మృగాడై పోతున్నప్పుడు .... దగ్ధమవుతున్న మా దేహం ... మాన- ప్రాణము .... ఆహుతైపోతున్నప్పుడు ... మృగారణ్యంలో......... మా మరణ మృదంగం అరణ్య రోదనై.... వేదనై... బాధామయ భాష్ప వరదై ప్రవహిస్తున్నప్పుడు .... అమ్మసైతం ఓదార్చలేని ..... అమ్మను నేను ... నిర్భయంగా .. నిర్లజ్జగా ... కామంధ.... రాబంధ మానబంగ పర్వంలో ........... నిర్దయగా ... అకారణ౦గా--- అన్యాయంగా అమానుషంగా ---హేయంగా గాయపడే నెత్తుటి చెమ్మను అమ్మను నేను ...కాల్చబడుతున్న బొమ్మను నేను !!! ఆకాశంలో సగం భూలోకంలో సగం ... అధికారంలో సగం రాజకీయంలో సగం దేశంలో సగం దేహం లో సగం .... సగం సగం సగం అన్నిట్లో సగం ఇదేరా వంచకుల విష పన్నాగం !!! నవనాగరిక కీచక లోకంలో నిర్భయంగా చరించే అభయం లేక ............ ఎడారి ఎండమావుల్లో దారితప్పిన లేడి పిల్లలమై ఒక్కోక్కరుగా రాలిపోతున్న పువ్వులం మేము హృదయం ముక్కలై దేహం పొక్కిలై చెక్కిలిపై జారే కన్నీటి చుక్కే చుక్కానైనప్పుడు ... తుఫానులో చిక్కిన దిక్కుతోచని చితికిన బ్రతుకు నావలం మేము !!! యత్రనార్యంతు పూజ్యంతే ........ అది ...........పుస్తకాలతంతే.. వంతే.... అంతే....!! అంగా౦గాన్ని వర్ణిస్తూ ..... అణువణువునూ రమిస్తున్న రక్త జలగల నెత్తుటి దాహాల రుధిర దేహాలం మేము !! ఇక్కడా .....అక్కడా ..లెనిదెక్కడా... విశ్వమంతా ..జగత్తంతా ....దేశ దేశాన మా దేహాల దాష్టీకాల రగిలే కష్టాలేనా రావణ కాష్టాలేనా ......... ‘దైవంమానుష రూపేణా’ ............... ఆ.................... దెయ్యాలు మానవ దేహాల్లో సయ్యాటలాడుతున్నాయి.......... మారీచ పిశాచ మాయా వ్యూహం లో మహిలళలేకదా.మాడి మసయ్యేది ... భరించి .........భరించి సహించి.........సహించి శాంతించి ...........శాంతించి చిట్టచివరి కన్నీటి చుక్కకు కూడా చితి పేర్చాక... తల్లీ క్షమించు .... నాక్షమనిక హరించు ....!! స౦హరించే నారసింహ రూపమై నన్నాశీర్వదించు !! చీడల్ని చీల్చే చండీనై........... కామాంధుల్ని కాల్చే కాళీనై................. రౌద్ర రుద్రమనై ...................... మృగాల్లని వధించే ఝాన్సీలమై .............. తిరగబడతామిక.....!!! తల్లీ క్షమించు ......మా సహనాన్ని హరి౦చు !! కలాలు ..ఖడ్గాలు గళాలు ....గన్నులు భగ్గుమంటున్న బాయినెట్లతో యుద్ధానికి సిద్ధమవ్వాలిక వీర నారీలోకం !! నవశకం కోసం ........... యుగ జాగృతి కోసం సమానత్వం కోసం సమసమాజం కోసం ............... సాయుధపోరైనా తప్పదిక .......!! పంజరాల్ని .... శృ౦ఖలాల్ని............. అడ్డొస్తే బంధనాల్ని ... చేదించేందుకు ... సిద్ధపడ్డ ...యుద్ధ నౌక !! ఉపస౦హారం ..............................! ఒక కొంగ్రొత్త ఉదయం కోసం............. దుక్ఖ రహిత శకం కోసం ............ ప్రేమమయ యుగం కోసం .................. నవ వసంతం కోసం ................ తిమిరం లేని ఆమని కోసం ................ స్వేచ్చ కోసం .... మమత కోసం ........... సమత కోసం ................. మానవజాతి మనుగడ కోసం ... మహిళల్ని రక్షిద్దాం ....పూజిద్దాం ..ప్రేమిద్దాం ! మనుషులు గా నైనా గుర్తిద్దాం ................!! మానవ లోకపు మరో శకానికి పురుడుపోద్దాం !! ( ఈ ఏక పాత్ర ... ఎవరైనా మహిళా మూర్తులు రికార్డ్ చేసిపంపిస్తే యూట్యూబ్లో పెట్టాలని ఆశిస్తున్నా ....) ------------------ 12 - 2 - 2014

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iOSDnG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి