పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఫిబ్రవరి 2014, సోమవారం

Sriramoju Haragopal కవిత

రాగోల గుటికిళ్ళు మింగుకుంటు కంటినీళ్ళు తుడుసుకుంటు ఎప్పుడేమయితదని ఒకటే రంధి తెలిసిందే అయినా కుదరదని సంధి తన భయాలకే తానే బందీ ఇగ ఊకో నా తెలంగాణా ఆకలితో ఎండిపోయిన డొక్కలదరువు పొర్లాడిన బాధలమత్తడి పొక్కిలి పొక్కిలైన బతుకుతెరువు ఇయ్యాలకూడా తప్పని వలపోత తెల్లారనిచ్చేటట్టు లేదీరాత్రి గెదిమిన పసులమంద నడుమ పోరగాళ్ళు పడ్డట్టు పాసిపోతున్నందుకుగాదు సొమ్ములు పాసిపోతున్నందుకు వలిచిన బంగారుపొలుసులు రాలి దేవుడు దయ్యంలెక్క కనపడుతున్నడు నెయ్యమెవనికి కావాలె, నియ్యతెవరికి వుండాలె రెక్కల్ని నమ్మినోళ్ళను కూడా తరిమి ఏడిపిస్తారెందుకు నిలబడి ఎదురుచూసి తొవ్వల్నే పాతుకుపోయినయి కండ్లు తెగబడి బందూకులకెదురు తిరిగిన చేతులే కట్టుకున్నాయి చరిత్ర నవ్వుతుంటే కాలం వెక్కిళ్ళు పడుతున్నది ఎప్పుడు కూడా రాజ్యం ఎవడి జేబులోనో పలికే మాయాజూదం ఇగనన్న తెల్లారదా, ఇప్పటికన్నా మారదా? 17.02.2014

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gNDwdD

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి