పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఫిబ్రవరి 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ \\ రాబందుల వెన్నెల వాన\\ ఎర్రబారిన అతి భయంకర ఆకాశంలో ఏవో పీనుగులను దూరదృష్టి వరించింది కామోసు నక్షత్రాల్లా ఎగురుతూ రాబందులు పగలే వెన్నెల కురిపిస్తున్నాయి! పాలెగాళ్ళ ఏలుబడిలో రాబడి ఎత్తుగడల పన్నాగాలకు బలిపశువులై పెనంమీద మాడిన ఊతప్పంలా ఈ మడుగుల్లో కుళ్ళుతున్న వాసన ముక్కులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! దిమాకు యిసుమంతైనా లేని మట్టిబుర్రలు స్వబడుగుల బుర్రలపైనే దాష్టీకంచేస్తూ తోటివారి తోళ్ళు ఒలిచి బరిసెలకు జెండాలు కడుతూ స్వంత గుండె గుడెసెలకే నిప్పుల స్నానం చేయిస్తున్నాయి.! భూస్వామ్య - అర్థస్వామ్య - బూర్జువా తైనాతీల దశనుండి నయా పెట్టుబడిదారీ పడమటిగాలి సమాజగతిని వక్రగతిలో ఆకులు విరిగిన ధర్మ చక్రంలా ఆకులురాలిన చెట్టై పీక్కుతింటున్నా ! రానని మొరాయించే వరుణునికోసం ఎలా దిగిరాదో చూద్దమని సామాజిక స్పృహ ఒంటికాలితో శ్మశానం వద్దే నిరీక్షిస్తుంటే స్లో మోషన్‌లో గ్లోబలి గాడు ప్రతీ పక్షాలతో మిలాఖతై వామపక్షాలపై కక్షకట్టి అతి దారుణంగా నిలువరించాలనే తపనను 24/7 మీడియా మాయా జాలర్ల వలలో పట్టి, మసాలా నింపాలనుకుంటే ఎక్కడో పాతాళంనుండి విప్లవ బడబాగ్ని కడుపును చీల్చుకొచ్చే అంకురంలా తలెత్తేందుకు తటాలున మెరుపు వేగంలా గెరిల్లా వ్యూహంతో కలాలు హలాలై చివురించే మొలకలు కావాలి! సూటిగా సూదిమొనలతో గుచ్చుకొని పాదాలకిందనున్న విషనేత్రాన్ని చిదిమేయాలి! అందుకు మీరు నేను మనమందరం నేరుగా నేలలో ఇంకేలా పట్టుదల నీరు పోద్దాం! రాబందుల వెన్నెల వానని రాకాచంద్రకాంతులుగా మారుద్దాం! 17.2.2014 ఉ.6.36

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKkwg0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి