పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Gangadhar Veerla కవిత

ఆకాశంలో చుక్కల్నిలెక్కపెట్టాలనే ఉంది ................... ఆకాశంలో.. కనిపించే చుక్కల్ని లెక్కపెట్టాలనే ఉంది ఇంకా లెక్కలేయాలనే ఉంది ఓపిక నశించేవరకు.. లెక్కలేయాలనే ఉంది.. అక్కడ కొన్ని చుక్కలు అవినీతి అంచును అంటుకున్నాయి మరికొన్ని.. స్వార్ధంతో ఎక్కడికో ఎగిరిపోతున్నాయ్ ఇంకొన్ని.. అవేం పట్టనట్టు నిశాకళ్ళతో.. పరేషాన్ చేస్తున్నాయ్ ఏమని నిలదీస్తే? ..... అసూయ ద్వేషం కలుషితం కల్మషం వాటన్నిటినీ పక్కనపెడితేగానీ నీలెక్కల్లోకిరానని మొరాయిస్తున్నాయ్ .. ఇప్పటికీ ఆకాశంలో చుక్కల్నిలెక్కపెట్టాలనే ఉంది చచ్చేలోపుగా ఏదో ఒక లెక్క వేయాలనే ఉంది ... గంగాధర్ వీర్ల- 17 ఫిబ్రవరి

by Gangadhar Veerla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1faUdQf

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి