పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Shaik Meera కవిత

నేను కవి సృష్టిలో నక్షత్రమైనందుకా ! ఎన్నెన్నో దారుణాలు , ఎన్నెన్నో సంఘటనలు ఘోరాలు విడ్డూరాలు వింతలు...... ఏవేవో వినకూడనివి చూడరానివి దృశ్యాలు సన్నివేశాలు సందర్భాలు ఈ అడవి లోకంలో ..... చదివాక చూశాక జ్ఞానమున్నాకా ఈ కవిజన్మమున్నాకా స్పందించేది కవితాక(కా)లమై రచించేది! నేనే ఎందుకు.... ? నా గుండెకు ఇన్ని విషాద రంధ్రాలు... ఇక్కడ ఊరేది వోలికేది కన్నీటిపుట శ్రమ స్వేద రక్తధారలేనా!.... నాకే ఎందుకు ఇంతటి ప్రపంచప్రజా మానవత్వ చైతన్యం నడక..... నాకే ఎందుకు ఇన్నిన్ని గాయాలు గేయాలు మథనాలు..... నాలో నాదాలు ఈ మృదంగాలు ఈ రుద్రవీణలు పలికేది నేను కవి సృష్టిలో నక్షత్రమైనందుకా ! .......షేక్ మీరా ....... 02/02/2014

by Shaik Meera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fx6M7P

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి