పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Sanjeev Goud కవిత

sanJEEVANA THARANGAALU/SANJEEV GK z_zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz తరంగాలెంతగా వీరంగమాడినా తీరాన్ని డీ కొడుతూ తాండవమాడినా తారంగమాడినా ధరణేమీ దద్దరిల్లదు !! ఆకాశమూ బద్దలవదు !! ఉవ్వెత్తున ఎగిసి పడే ఆ అలల ఉదృతి చూసి నీకూ నాకూ ఉగ్ర భీభత్స భయోత్పాతంగా అనిపించినా కనిపించినా అది ఆ తీరానికి మాత్రం నిరంతర నిర్విరామ ప్రక్రియే !! అందుకే నేనంటాను!? పడిలేచే కెరటాల ఉరవడి కన్నా పోటెత్తే పొరలొచ్చె ఉప్పెన వరదలో భీకరంగా ప్రజ్వరిల్లే సునామీ జ్వాలలో తీరాన్ని అతలాకుతలం చేస్తాయ్ !! కదిలిస్తాయ్ !!ప్రక్షాలిస్తాయ్ !! అందుకే నేనంటాను!? సమ్మెలూ సత్యాగ్రాహాలూ నిరసనలూ ధర్నాలూ పడిలేచే కెరటాలవంటివే !! ఫలితాన్ని శాసించేది పటిష్ట ఉద్యమ పోరాట క్రమం !! పదం కదం వెల్లువయ్యె పరాక్రమం !! అందుకే నేనంటాను!? కోటగోడలు కూల్చేయనిదే మార్గం గమ్యం సాధ్యం కానేరదు !! యుద్ధం అసలు చేయకుండానే విజయ లక్ష్యం చేరువ కాబోదు !!! సమరం అనంత క్లేశాల అంతానికి అంతిమ సాధనం ! సమస్త సమస్యల ముగింపుకి శ్రేష్టమైన ఆయుధం!! **********************************************

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCZQdQ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి