పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Sahir Bharathi కవిత

ప్రేమ................. ......................................... ప్రేమ -ఒక అద్భుతమైన స్పర్శ అది మన శరీరానికి కాదు , మన ఆత్మకు మాత్రమే కలిగే స్పర్శ. ఒక మనిషి జీవితంలో తనకుతానే కాదని , తానుకూడా ఉన్నానని తెలిపే అంతరాత్మ . అది మనం ఈ భూమిపై పాదం వొంపినప్పటినుండి మన నీడలా ఎప్పుడూ మనతో ప్రయాణిస్తుంది అది మన అమ్మ ఒడిలో మొదలై నాన్న నీడలో కొనసాగుతుంది అది ఒక అన్నదమ్ముల అనుబంధంలా నడుస్తుంది. ఒకరోజు మనల్ని ప్రేమికుడిలా మారుస్తుంది. స్నేహమని తాను తనపేరును మార్చుకుని జీవితంలో ఈదుతుంది ఇలా తానూ తన ముఖచిత్రాలను మార్చుకున్నా తన నిజస్వరూపాన్ని మరచిపోదు కపటంలేని ప్రేమనే నిజమైన అస్తిత్వమని గుర్తించాను అవును నేను ప్రేమను పంచే మనిషినయ్యాను .........sahir bharati 2.2.2014

by Sahir Bharathi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LCJpzq

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి